Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

పంచాయతీ ఎన్నికలపై రేపు ఇసి భేటీ

ec

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజి పి, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి, విప త్తు నిర్వహణశాఖ ముఖ్యకార్యదర్శి, జిఎడి ముఖ్యకార్యదర్శి, కుటుంబ సంక్షేమ, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, పంచాయతీరాజ్, స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్ విద్య, ఉన్నత విద్య కమిషనర్లతో పాటు ఎన్నికల నిర్వహణ కు సంబంధం ఉన్న ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. ఎన్నికల నిర్వహణపై వారి అభిప్రాయాలను, సూచనలను ఈ సమావేశంలో ఎన్నికల సంఘం తెలుసుకుంటుందన్నారు.

Comments

comments