Home తాజా వార్తలు నేడే నిమజ్జనం

నేడే నిమజ్జనం

gsh

మన తెలంగాణ/ హైదరాబాద్ సిటీ బ్యూరో:హైదరాబాద్ నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో నే డు జరిగే వినాయక నిమజ్జనం భారీగా సాగే గణేశుల శోభాయాత్రకు వేలాది మంది పోలీసులతో భద్రత తదితర సమగ్ర ఏర్పాట్లను చేశా రు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 60 వేలమంది పోలీసులు భద్రతలో నిమగ్నమయ్యారు. పోలీ సు కమిషనర్‌తో పాటు నలుగురు అదనపు సిపిలు, 9 మంది డిసిపిలు, 20 అదనపు డిసిపి లు, 64మంది ఎసిపిలు, 244 మంది ఇన్‌స్పెక్టర్‌లు, 618 మంది ఎస్‌ఐలు, 636 మంది ఓఎస్‌ఐలు1700మంది హెడ్ కానిస్టేబుళ్లు, 7198 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 6వేలమంది హోంగార్డులు, 680మంది ఎస్‌పిఒలు భద్రత లో నిమగ్నమయ్యారు. వీరికి తోడు 5ఐజీలు, డిఐజి, 19 మంది ఎస్‌పిలు, 53 మంది డిఎస్ పిలు, 128 మంది సిఐలు, 129 మంది ఎస్‌ఐలు, 6మహిళా ఎస్‌ఐలు, 1336 మంది ఎఎస్‌ఐలు 5239 మంది కానిస్టేబుళ్లు, 140 మం ది మహిళా కానిస్టేబుళ్లు,1426 మంది హోం గార్డులు బందోబస్తులో ఉంటారు. సాయుధ బలగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. గ్రే హౌండ్స్,అక్టోపస్ బలగాలు కూడా అత్యవసర సమయంలో సేవలుఅందించేంకు సిద్దంగా ఉన్నారు. టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్,ఆర్మ్‌జ్ రిజర్వ్ పోలీసులు, ఎస్‌బీ లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీసులు కూడా సేవలు అందిస్తారు.
విగ్రహాలకు జియో ట్యాగింగ్
విగ్రహాలు ఊరేగించే రోడ్లపై పోలీసులు దృష్టిసారించారు. ప్రధానం గా బాలాపూర్ నుండి హుస్సేన్ సాగర్ వరకు వచ్చే వాహనాలు, ట్రాఫిక్ ,18కిలో మీటర్ల రోడ్డు ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగిన చర్యలు చేపట్టారు. సిటీలో 120కిలో మీటర్ల నుండి గణేష్ విగ్రహాలను ఈ ప్రధాన రోడ్డును కలుపుతుంది. ఈ కారణంగా వాహానాలకు ట్రాఫిక్ సమస్య వచ్చే అవకాశం ఉంది, ట్రాఫిక్‌ను సమస్యలేకుండా కసరత్తు చేస్తు విగ్రాహాలు పూర్తిగా నిమజ్జనం చేసేందుకు ప్రనాళికను సిద్ధం చేశారు.
నిమజ్జనానికి 14వేల గణనాథులు..
హుస్సేన్ సాగర్ లో ఇప్పటి వర కు 11 వేల విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు అధికారులు లెక్క తేల్చారు. సిటీలో మరో 14500 విగ్రహాలు నిమజ్జనాకి తరలి రానున్నాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిమజ్జనం కోసం ప్రత్యేకంగా 51 క్రేన్ లు ఏర్పాటు చేసిన అధికారులు, క్రేన్‌లకు రిలీజ్ హుక్ లు ఏర్పాటు చేశారు. 4 నుండి 6 నిమిషాల్లో విగ్రహాలను నిమజ్జనం చేయడం ఈ హుక్‌ల ప్రత్యేకతని అధికారులు స్పష్టం చేశారు. గణేష్ విగ్రహాలను ఉదయం ఆరు గంటల వరకు నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించి అందుకు అనుకూలంగా ముందుకుసాగనున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద 51 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గ్ లో 12 క్రేన్లు, నాలుగు రిజర్వులో ఉంచారు. ట్యాంక్‌బండ్ వద్ద 23 క్రేన్ లు తో నిమజ్జం కార్యక్రమం పూర్తి చేయనున్నారు. మినిష్టర్ రోడ్డు వద్ద 3 క్రేన్లు, రాజన్నబౌలి వద్ద 3, మీరాలం ట్యాంక్ వద్ద రెండు, ఎర్రకుంట వద్ద మరో రెండు క్రేన్లు ఏర్పాటు చేశారు..
నిమజ్జనం ప్రత్యేకం..
నిమజ్జనం కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు నాలుగు మౌంట్‌డ్ కెమారాలను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్ గణేష్ తెలుగుతల్లి ప్లైఓవర్ వద్ద ఏర్పాటు చేయడం విశేషం. పోలీసు సమాచారం వ్యవస్థను పటిష్టం చేశారు అందు కోసం 2800 వైర్ లెస్ సెట్లు, అదనంగా 500 సెట్ల సమకూర్చారు, నిమజ్జనం కోసం ప్రత్యేకంగా 11 కమ్యూనికేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించేందుకు 15 అంబులెన్స్‌లు,15 అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉన్నాయి.