Home జోగులాంబ గద్వాల్ రేపటి నుండి అలంపూర్ లో నామినేషన్లు

రేపటి నుండి అలంపూర్ లో నామినేషన్లు

MPTC, ZPTC Nominations

 

జోగులాంబ గద్వాల్: జిల్లాలోని అలంపూరు మండలంలో వివిద గ్రామాలకు చెందిన ఎంపిటిసి స్థానానాలకు, అలంపూర్ జెడ్పిటిసి స్థానాలకు నామినేషన్లను మంగళావారం నుండి స్వీరించనున్నట్టుగా ఇన్‌చార్జి ఎంపిడిఓ రమణారావు తెలిపారు. అలంపూర్ నూతంగా మున్సిపాలిటి ఏర్పాటు కావడంతో గతంలో వున్న మూడు ఎంపిటిసి స్థానాలు రద్దు కావడం జరిగింది. నూతంగా ఉండవెల్లి మండలం ఏర్పాటు కావడంతో తక్కశీల, ప్రాగటూరు మారుమునగాల, శేటిపల్లె, బైరాపూరు, బస్వాపూరు గ్రామాలు ఆ స్థానాలను అందులో కల్పడం జరిగింది. ఇమాంపూరు గ్రామాని అలంపూర్ మున్సిపాలిటిలో కలవడంతో ఆ గ్రామానికి పంచాయతి ఎన్నికలు నిర్వహించలేదని, ఎంపిటిసి ఎన్నికలు కూడా నిర్వహించడం లేదని రమాణావావు స్పష్టం చేశారు.

అలంపూరులో అన్ని ఎంపిటిసి స్థానాలను టిఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకొంటుందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తాలు తీసుకొని అందర్ని సమన్వయంతో కలుపుకొని వెళ్లితేనే గెలుపు ఖాయమవుతుందని ఆయన అన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ప్రజలలో మంచి ఆదరణ కలిగి వున్న పార్టీ అని ఆయన గుర్తు చేశారు. అలంపూర్ మండలంలో మొత్తం ఆరు ఎంపిటిసి స్థానాలు, 1 జెడ్‌పిటిసి స్థానానికి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎంపిటిసి స్థానానికి జనరల్ వారికి 2,500 ఫీజు జెడ్‌పిటిసి స్థానానికి జనరల్ వారికి 5,000 వేల ఫీజు నిర్ణయించారు. రిజర్వు ఆ స్థానాలను ఆయన తెలిపిన వివరాల ప్రకారం… క్యాతూరు, బుక్కాపురము ఇతరులకు కేటాయించగా లింగనవాయి, సుల్తానాపుర్ ఎంపిటిసి స్థానాలను మహిళలకు కేటాయించారు. భీమవరం ఎస్ సి మహిళలకు, కాశిపురము బిసి మహిళలకు కేటాయించారు. అలంపూరు జెడ్పిటిసి స్థానం అన్‌రిజర్వుడు మహిళలకు కేటాయించారు.

Tomorrow is MPTC, ZPTC Nominations in Alampur