Home జిల్లాలు రేపు ఎస్‌విఎస్ కళాశాలలో జాబ్ మేళా

రేపు ఎస్‌విఎస్ కళాశాలలో జాబ్ మేళా

svs-gropకెయూక్యాంపస్ : రామారంలోని ఎస్‌విఎస్ కళాశాలల ప్రాంగణంలో ఈనెల 23న విద్యార్థుల సౌకర్యార్థం ఎస్‌విఎస్ కళాశాల, ఓప్ డాట్ కామ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఎస్‌విఎస్ కళాశాలల చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి తిరుమల్ రావు, సెక్రటరీ అనూప్, ఓప్ డాట్ కామ్ సిటిఓ పృథ్వీరాజ్ తెలిపారు. కళాశాలల ప్రాంగణంలో గురువారం విలే కరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ సుమా రు 25 ప్రముఖ బహుళజాతి కంపెనీలు కళా శాలలో జాబ్ మేళాలు నిర్వహించి విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. హెచ్‌సిఎల్, పొలారిస్, జెన్‌ప్యాక్, ఐసిఐసిఐ, హెటిరో డ్రగ్స్, గ్లాండ్ ఫార్మా, రాంటెక్, హెచ్‌డిఎఫ్‌సి, రిలయన్స్ లాంటి ప్రముఖ కంపెనీలు వస్తున్నట్లు తెలిపారు. ఇందుకుగాను ఇప్పటికే ఐదువేల మంది విద్యార్థులు 10000 జాబ్‌మేళా.కామ్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారని, ఆసక్తిగల బిటెక్, ఫార్మసీ, ఎంబిఎ, డిప్లమా పూర్తి చేసిన విద్యా ర్థులు పై వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని అన్నారు. ఒక వేళ ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు 23వ తేదీ ఉదయం 8 నుంచి 9 గంటల వరకు నేరుగా ఎస్‌విఎస్ కళాశాలకు విచ్చేసి నమోదు చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదని అన్నారు. విద్యార్థులు వచ్చే ముందు ఒక ఫొటోతో పాటు ఐదు సెట్ల రెస్యూంలను తీసుకొని రావాలని అన్నారు. 23న జరిగే జాబ్ మేళా ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అ వుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సిఎం, ఉన్నత విద్యా శాఖామంత్రి కడియం శ్రీహరి, గౌరవ అతిథిగా వర్థన్నపేట ఎమ్మె ల్యే ఆరూరి రమేష్‌లు విచ్చేసి ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్ర మంలో కళాశాల ప్రిన్సిపా ళ్లు, ప్లేస్‌మెంట్ అధికారి పాల్గొన్నారు.