Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రేపు ట్రాఫిక్ ఆంక్షలు

BUSహైదరాబాద్ : గణేశ్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఆదివారం నగరంలో ట్రాఫికక్ష ఆంక్షలు విధించారు. రేపు జంటనగరాల్లో ఆర్‌టిసి సిటి సర్వీసులు తిరిగే ప్రాంతాల్లో మార్పులు చేశారు. మెహదీపట్నం బస్సులు మాసబ్‌ట్యాంక్ వరకే నడపాలని నగర పోలీసులు సూచించారు. కూకట్‌పల్లి నుంచి వచ్చే బస్సులు ఖైరతాబాద్ వరకు, ఎల్‌బినగర్ నుంచి వచ్చే బస్సులు ఛాదర్‌ఘాట్ , కోఠి వరకు మాత్రమే అనుమతిస్తారు. తార్నాక, ఉప్పల్ నుంచి వచ్చే బస్సులు క్లాక్ టవర్ వరకు, మిధాని, కర్మన్‌ఘాట్ నుంచి వచ్చే బస్సులు ఐఎస్ సదన్ వరకు అనుమతిస్తారు. ప్రత్యేక బస్సులను నారాయణగూడ వైఎంసిఎ వరకు అనుమతిస్తారు. ఎంఎంటిఎస్ రైళ్లు యధాతధంగా నడుస్తాయి. రద్దీకి అనుగుణంగా మరో ఎనిమిది స్పెషల్ ఎంఎంటిఎస్ రైళ్లను నడుపుతారు.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా నేడు,రేపు 75 వేల మంది పోలీసులతో జంటనగరాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐటిబిపి, ఆర్‌ఎఎస్‌పి, ఎపిఎస్పి అదనపు బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. జంటనగరాల్లో సున్నితమైన, ప్రధాన రద్దీ ప్రాంతాల్లో సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. రేపు ట్యాంక్‌బండ్‌లో 1700 విగ్రహాలు నిమజ్జనమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Comments

comments