Search
Monday 16 July 2018
  • :
  • :

15 అంతస్తుల భవనం 10 సెకండ్లలో ఎలా నేలమట్టమైందో చూడండి…(వీడియో)

Took Just 10 Seconds To Demolish 15-Floor Building in China

బిజీంగ్: ఇల్లు కట్టడం చాలా కష్టం గానీ, పడగొట్టడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదనేది అందరికీ తెలిసిందే. అయితే భవనాలను నేలమట్టడం చేయడంలో చైనీయులు అనుసరిస్తున్న పద్దతులు ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కళ్లుమూసి తెరిచేలోగా ఆకాశాన్నంటే భవనాలను నేలమట్టం చేసేస్తున్నారు. తాజాగా చైనాలోని చెంగ్డూ నగరంలో 15 అంతస్తుల భవనాన్ని కేవలం పదంటే పది సెంకడ్లలో నేలమట్టం చేశారు. ఆ భవనం చాలా పాతది కావడంతో పాటు నివాసయోగ్యంగా లేకపోవడంతో భవన యజమాని దాన్ని కూల్చి షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని నిర్ణయించాడు. అనుకున్నదే ఆలస్యం వెంటనే పదిహేను ఫ్లోర్ల బిల్డింగ్‌ను 10 సెకండ్లలో కూల్చేశారు. భవనం నేలమట్టం చేసిన సమయంలో తీసిని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

Comments

comments