Home రంగారెడ్డి సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికలే టాప్

సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికలే టాప్

 Top of the supplementary results are girls

65.58% ఉత్తీర్ణతతో 8వ స్థానంలో మేడ్చల్ జిల్లా
రంగారెడ్డి 57.05% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 13వ స్థానం
21వ స్థానంలో సరిపెట్టుకున్న వికారాబాద్ జిల్లా
మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పదవ తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల ఫలితాలలో బాలికలు మరోసారి సత్తాచాటారు. రంగారెడ్డి జిల్లాలో బాలురు 56.55%, బాలికలు 57.73% ఉత్తీర్ణత సాధించిపై చేయి సాధించారు. జూన్ 6 నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహించిన అధికారులు ఫలితాలను విద్యార్దుల భవిష్యత్‌ను పరిగణలోనికి తీసుకుని త్వరగా ఫలితాలను వచ్చేలా చర్యలు తీసుకున్నారు. శనివారం నాడు విడుదల చేసిన ఫలితాలలో రాష్ట్రంలో మేడ్చల్ జిల్లా 8వ స్థానం, రంగారెడ్డి 13వ స్థానంలో ఉండగా వికారాబాద్ జిల్లా మాత్రం 21వ స్థానంతో సరిపెట్టుకుంది. రంగారెడ్డి జిల్లా నుంచి పదవ తరగతి ఆడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు 6747 మంది విద్యార్దులు హజరుకాగా 3849 విద్యార్దులు ఉత్తీర్ణులైనారు. 3907 బాలురకు 56.55% ఉత్తీర్ణత శాతంతో 2206 మంది ఉత్తీర్ణత సాధించగా 2846 బాలికలకు గాను 57.73% ఉత్తీర్ణతతో 1643 బాలికలు ఉత్తీర్ణత సాధించారు. మేడ్చల్ జిల్లా నుంచి 6276 మంది విద్యార్దులు పదవ తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు హజరుకాగా 4116 మంది విద్యార్దులు ఉత్తీర్ణులైనారు. 3723 మంది బాలురకు 2450, 2553 మంది బాలికలకు గాను 1666 ఉత్తీర్ణులైనారు. బాలురు 65.81, బాలికలు 65.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. వికారాబాద్ జిల్లాలో 4387 విద్యార్దులు పరీక్షలకు హజరుకాగా 1770 మంది ఉత్తీర్ణులైనారు. 40.35 ఉత్తీర్ణత శాతంగా రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది. 2598 మంది బాలురు పరీక్షలకు హజరుకాగా 991ఉత్తీర్ణులైనారు. 1789 బాలికలు పరీక్షలకు హజరుకాగా 779 ఉత్తీర్ణులైనారు. 38.14% బాలురు, 43.54% బాలికలు ఉత్తీర్ణులైనారు.
రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్…
పరీక్షల మార్కులపై అభ్యంతరం ఉన్న విద్యార్దులు ఈ నెల 8 నుంచి 16 వరకు రీకౌంటింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున చలాన్ చెల్లించి రీకౌంటింగ్ జరిపించుకోవచ్చు. రీవేరిఫికేషన్‌కు సైతం అవకాశం కల్పించిన అధికారులు ఒక్కో సబ్జెక్టుకు వేయి రూపాయల చలాన్ కట్టవలసి ఉంటుందని సూచించారు.