Search
Wednesday 14 November 2018
  • :
  • :

యువతకు ప్రాధాన్యం

uttam

కాంగ్రెస్‌లో యువతరానికి అగ్రస్థానం కల్పిస్తామని రాహుల్‌గాంధీ మాట ఇచ్చారు :
కుంటియా 26 నుంచి జనంలోకి వెళ్తున్నాం : సేవాదళ్ సదస్సులో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 26 నుండి ప్రారంభమయ్యే కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిలదీస్తామని, కాంగ్రెస్ ఇచ్చే హామీలను వివరిస్తామని టిపిసిసి అధ్యక్షులు ఉత్తవ్‌ు కుమార్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా  నియంతృత్వ పద్ధ తులను, అవినీతి, అక్రమాలను, మానవ హక్కుల ఉల్లంఘనల ను,అన్నివర్గాలను మోసం చేసిన తీరులను వివరించి ప్రజలను చైతన్యం చేస్తామన్నారు.  గాంధీభవన్ ఆవరణలోని ఇందిరాభవన్‌లో గురువారం నాడు జరిగిన సేవాదళ్  సదస్సు జరిగింది.  సేవాదళ్ చైర్మన్ కనుకుల జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉత్తవ్‌ు, ఎఐసిసి ఇంచార్జ్ రాంచంద్ర కుంటియా, కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ,  భట్టి విక్రమార్క, ఎం.ఎ ఖాన్, పొంగులేటి సుధాకర్ రెడ్డి,  హనుమంతరావు, కోదండరెడ్డి, సేవాదళ్ తెలంగాణ ఇంచార్జ్ కెకె పాండే పాల్గొన్నారు. ఈ సందర్భంంగా ఉత్తవ్‌ుకుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తొలి సంస్థ సేవాదళ్ అని, స్వాతంత్ర సంగ్రామంలో సేవాదళ్ పోరాటం అనిర్వచనీయమని కొనియాడారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డ తరువాత రాష్ర్టంలో ఏ ఒక్క వర్గం కూడా ఆనందంగా లేదని, నాలుగు కోట్ల ప్రజల్లో కేసిఆర్ కుటుంబంలోని నలుగురు తప్ప ఎవరు బాగు పడలేదని విమర్శించారు., విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల, మైనారిటీ వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని, అవినీతి అప్పులు తప్ప రాష్ట్రానికి ఏమి మిగలలేదన్నారు. కుంటియా మాట్లాడుతూ ఈ సారి యువతకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ఇప్పటికే ఎఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారన్నారు. రాష్ర్టంలో బంగారు తెలంగాణ అంటు ప్రచారం చేస్తున్నారని కానీ ఒక్కకెసిఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మారిందని విమర్శించారు. ఇదిలాఉండగా గాంధీభవన్‌లో తొలి కేంద్ర విద్యా శాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ 60వ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. గాందీభవన్‌లో ఆయన చిత్ర పటానికి మాజీ ఎం.పి హనుమంతరావు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే ప్రకాశం హాల్‌లో కార్యక్రమంలో పిసిసి ఛీఫ్ ఉత్తమ్ ప్రసంగించారు.

Comments

comments