Home జగిత్యాల నాలుగేళ్ల పాలనలో ఒరిగిందేమి లేదు

నాలుగేళ్ల పాలనలో ఒరిగిందేమి లేదు

total debt of telangana

రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ చేశారు
పైపుల కంపెనీల కమీషన్ల కోసమే మిషన్ భగీరథ
సిఎల్‌పి ఉపనేత జీవన్‌రెడ్డి

మనతెలంగాణ/జగిత్యాల: నాలుగేళ్ల టిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమి లేదని, తాము చేపడుతున్న పథకాలను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో అమలు చేయాలనుకుంటున్నారని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని సిఎల్‌పి ఉపనేత, జగిత్యాల ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి విమర్శించారు.ఆదివారం జగిత్యాలలోని ఆయ న నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీ వన్‌రెడ్డి మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయ ంలో తెలంగాణకు రూ.60వేల కోట్ల అప్పులు ఉంటే టిఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల నేడు రూ.2 లక్షల కోట్ల అప్పు ఏర్పడిందన్నారు. గత 58ఏళ్లలో ఏడాదికి రూ.1000 కోట్ల మేర అప్పులు చేస్తే టిఆర్‌ఎస్ ప్రభుత్వం నెలకు రూ.3 వేల కోట్లఅప్పులు చేస్తోందన్నారు.విద్యార్థులు,నిరుద్యోగ యు వత ఆత్మబలిదానాలను చూసి సోనియాగాంధీ చలించి ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇ స్తే సిఎం కెసిఆర్ రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారన్నారు.ప్రజావ్యతిరేక విధానాల పట్ల నిరసన వ్య క్తం చేసే హక్కును హరించివేస్తూ అణగదొక్కుతున్నారని వి మర్శించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఉండేవా రం కాదన్నారు.తెలంగాణ ఏర్పడిన సమయంలో 1.08 ల క్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు ప్రకటించారని,ఈ నాలుగేళ్లలో ఆ ఖాళీలు 2 లక్షలు చేరుకున్నాయన్నారు.
అయితే ఈ నాలుగేళ్ల కాలంలో 12వేల ఉద్యోగాలను భర్తీ చేశామని టిస్‌పిఎస్‌సి చైర్మన్ ఘంటా చక్రపాణి స్వయం గా చెప్పారని, దీన్ని బట్టి చూస్తే కనీసం 10శాతం కూడా ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు డిఎస్‌సిలు నిర్వహించగా తెలంగాణ ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయలేదని విమర్శించారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత నిరాశ,నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్నారన్నారు.విద్యాహక్కు చ ట్టం అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నా రు. తాము అధికారంలోకి వస్తే ముస్లిం, మైనార్టీలకు నా లుగు నెలల లోపు 12శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామ ని హామీ ఇచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లు గడిచినా రిజర్వేషన్లకు అతీగతీ లేదన్నారు. టిఆర్‌ఎస్ నేతలు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తూ 12 శాతం రిజర్వేషన్లు నమ్మబలకడం చూస్తే ఆశ్చర్యం వేస్తోందన్నారు. గిరిజనులకు వారి జనాభా ప్రాతిపదికన 10శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈ నాలుగేళ్లలో480మంది గిరిజన బిడ్డలు డాక్టర్లు అయ్యే అవకాశా న్ని కోల్పోయారన్నారు.మిషన్ భగీరథ పేరుతో 40వేల కో ట్ల అప్పులు చేశారని,పైపుల కంపెనీలు ఇచ్చే కమీషన్ల కో సమే తప్పా ఆ పథకంతో ప్రయోజనమేమి ఉండదన్నారు. ప్రాణహిత,పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాలకు నీరందించే అవకాశముందన్నారు. ఎత్తిపోతల ద్వారా చెరువులు, కుంటలు నింపినట్లయితే భూ గర్భ జలాలు పెరిగి సాగు, తాగు నీటి సమస్యలు పరిష్కారమవుతాయన్నా రు. రెవెన్యూ రికార్డుల శుద్దీకరణ కార్యక్రమం చేపట్టినా తప్పులు తప్పులుగానే ఉన్నాయని, ముఖ్యమంత్రి అధికారులను చివాట్లు పెట్టి తప్పులను సవరించేందుకు ప్రత్యేకాధికారులను నియమించాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మిదేవేందర్‌రెడ్డి, మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, నాయకులు కొలుగూరి దామోదర్‌రావు, కొత్త మోహన్, బండ శంకర్, మున్సిపల్ వైస్ సిరాజుద్దీన్ మన్సూర్, కౌన్సిల ర్లుగాజుల రాజేందర్,అల్లాల సరిత, పిప్పరి అనిత, పుప్పాల అశోక్ తదితరు లు పాల్గొన్నారు.