Search
Friday 16 November 2018
  • :
  • :

అరుదైన పిట్ట ‘టోటమా టైల్యులో ’

Totama-Bird

టోటమా టైల్యులో అనే కొత్త జాతి పిట్టను మొట్టమొదటిసారిగా కొలంబియాలోని రిసారా లాడాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ సైన్సెస్‌కు చెందిన పక్షి శాస్త్రవేత్త ఎమ్. గైరీ స్టైల్స్ 1992 జూన్ 1న ఈ పక్షిని చూశాడు. ప్రస్తుతం ఆ పక్షి డిఎన్‌ఎ, వోకలైజేషన్‌లను పరిశీలించగా, అరుదైన పక్షి జాతికి చెందినదని తేలింది. అర్దశతాబ్దం వరకు దేశంలోని ఇలాంటి పక్షి ఉందేమోనని అధ్యయనం చేశాక, లేదని నిర్ధారించుకుని చివరికి దీనికి పేరు పెట్టినట్లు పరిశోధక బృందం తెలిపింది. ఈ పక్షులు చిన్నవిగా, మధ్యరకంగా ఉంటాయి. మొత్తం పొడవు 10 నుంచి 23 సెంటీమీటర్లు. బరువు 10 నుంచి 185 గ్రాములు. రెక్కలు చిన్నవిగా వెడల్పుగా ఉంటాయి.

Comments

comments