Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పర్యాటకంగా పోచారం

బోటింగ్ సదుపాయంతో సందర్శకుల విహారం
డ్యాంలో బోటింగ్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్
మత్సకారుల జీవనోపాధికి కూడా చర్యలు
సెలవుదినాలలో పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం
జిల్లా కలెక్టర్ భారతిహోళికేరి

POCHARAM

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : మెదక్ జిల్లాను పర్యాటక రంగంలో అభివృద్ధి చేసేందుకై అన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ భారతిహోళికేరి తెలిపారు. శని వారం జిల్లా ఎస్పీ చందనాదీప్తితో కలిసి కలెక్టర్ పోచారం రిజర్వా యర్‌లో సందర్శకుల సౌకర్యార్థం బోటింగ్‌ను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానికంగా ఉన్న మత్సకారులలో నిరుద్యోగులైన ఎనిమిది మంది మత్సకారులకు రాజధానిలో గల హుస్సేన్‌సాగర్ సేలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి వారం రోజుల పాటు బోట్ రైడింగ్ శిక్షణ ఇప్పించారు. దీని ద్వారా వారికి జీవనోపాధి పెంపొందించడమే కాకుండా మత్స కారులు ఈ ఉపాధి ద్వారా జీవనోపాధి పెంపొందించుకోవాలని కలెక్టర్ కోరారు. అనంతరం బోటింగ్‌లో ఎస్పీతో కలిసి కలెక్టర్ పోచారం ప్రాజె క్టులో విహారం చేసారు. ఆర్డీవో నగేష్, మత్సశాఖ ఎడి లక్ష్మీ నారాయణ, మండల అభివృద్ధి అధి కారి రాంబాబు పాల్గొన్నారు.

Comments

comments