Home కుమ్రం భీం ఆసిఫాబాద్ ఆహ్లాదాన్ని పంచుతున్న్న పర్యాటక ప్రదేశాలు

ఆహ్లాదాన్ని పంచుతున్న్న పర్యాటక ప్రదేశాలు

కొత్త జిల్లాలో అందమైన ప్రాంతాలు
ఆహ్లాదానికి దూరమవుతున్న పర్యాటకులు
ప్రాజెక్టులకు లేని బోటింగ్ సదుపాయం

Water-Flood1ఆసిఫాబాద్‌టౌన్: ఆదిలాబాద్ జిల్లా అంటే అడవుల జిల్లా అని ఒకప్పుడు అందరికి తెలి సినా విషయమే. కొత్త జిల్లా ఏర్పాటు అనం తరం కోమురంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా గా ఏర్పడగా ఈ జిల్లా పరిధిలోని కొన్ని మండలాలలో దట్టమైన అడవి ప్రాంత ంతో పాటు ఆహ్లాదకరమైన వాతావ రణం, కనులవిందు చేసే వాటర్ ఫాల్స్, కాశ్మీర్,గోవా లాంటి ప్రదే శాలను తలపించే లోతట్టు ప్రాంతా లు, ప్రకృతి ఒడిలో గిరిజన తండా లు ఇక్కడి ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Water1నియోజక వర్గంలోని కెరమెరి,తిర్యాణి, జైనూ ర్, సిర్పూర్ (యు) వాంకిడి తదితర మండలాలలో వాటర్ ఫాల్స్ కను విందు చేపడుతున్నాయి. అందమైన గుట్టల నుంచి జాలు వారుతూ వంకలు తిరుగుతూ ప్రవాహిస్తూ పర్యాటక ప్రాంతా లుగా ఏర్పడుతున్నాయి. అయి తే అవి పూర్తిగా గిరి జన ప్రాం తాల లోని దట్టమైన అడవులలో ఉండ డంతో సరియైన దారు లు లేక, రవాణా సౌక ర్యాలు లేక పర్యా టకులు ఎన్నో ఇబ్బం దు లను ఎదుర్కొంటూ వాటి వద్దకు చేరుకొని ఆహ్లాదాన్ని పొందుతున్నారు. ఆసిఫాబాద్ మండలంలోని సమూ తుల గుండం వాటర్ ఫాల్స్, వర్షాకాలంలో భారీ నీటి ప్రవా హంతో చూడముచ్చటగా కనిపి స్తోంది. ఇక్కడి వరకు వెళ్ళేందుకు మోవాడ్,బాలాన్‌పూర్ గ్రామం వరకు రోడ్డు సౌకర్యం ఉన్న సము తూల గుండం వరకు ఎలాంటి రోడ్డు సౌకర్యం లేకపోగా మధ్యలో ఉన్న రెండు వాగులు దాటి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. సిర్పూర్ (యు) మండ లంలోని సప్త గుండాల జలపాతం కూడ ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Flood-mainఎత్తైనా గుట్టల నుం డి సప్త గుండాల ద్వారా భారీ శబ్దంతో వాటర్ ఫాల్స్ ఏర్పడగా దీనిని చూసేందుకు నిర్మల్, మంచిర్యాల, ఉట్నూర్,కరీంనగర్ జిల్లాలోని కొన్ని మండ లాలతో పాటు జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల నుండిపర్యాటకులు వస్తుంటారు. సెలవు రోజుల లో కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి వచ్చి సేద తీరుతూ ప్రకృతిలో ఆహ్లాదకరాన్ని పంచుకుంటున్నారు. వాటర్ పాల్స్ దగ్గర ఫోటోలు దిగి వాటిని భద్రప రుచుకొని మురిసిపోతున్నారు. అదే విధంగా తిర్యాణి మండలంలోని గుండాల వాటర్ ఫాల్స్‌కు ఎంతో చరిత్ర ఉండగా ఇక్కడికి వెళ్ళేందు కు కూడ సరియైన రోడ్డు మార్గం లేక కొద్ది మందికి మాత్రమే తెలుస్తోంది. అయినప్పటికి పర్యాటక ప్రేమికులు మాత్రం వాటర్‌ఫాల్స్ వద్దకు రోంపల్లి గ్రామం మీదుగా 15 కిలోమీటర్లు కాలినడకన నడిచి అక్క డికి చేరుకొని జలపాతాన్ని సందర్శిస్తుంటారు. ఇదే మండలంలో దట్టమైన అడవిలో అర్జున్‌లోద్ది గృహా కను విందు చేస్తుంది.

కెరమెరి మండలంలో శంకర్‌లోద్ది, జగ్గు బాయ్ గృహాలు పర్యాటక ప్రాంతాలకు నెలవులుగా కాగా కెరమెరి నుండి ఉట్నూర్ మార్గంలో 10 కిలో మీటర్ల ఎత్తైనా ఘాట్ రోడ్డు ప్రతి సారి వెళ్ళి వచ్చే వారికి ఎంత గానో ఆహ్లాదాన్ని పంచుతోంది. కాగా  నియోజకవర్గంలో భారీ కోమర ంభీం ప్రాజెక్టు, మట్టివాగు ప్రాజెక్టు, ఎన్టీఆర్ రిజర్వాయర్ ప్రాజెక్టు లాం టి ఉన్నా ఇక్కడ బోటింగ్ సదు పాయాలను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు.కొత్తగా ఏర్పడిన కోము రంభీం జిల్లాలో ఎంతగానో ఆకట్టు కునే వాటర్ ఫాల్స్ చారిత్రాక కట్ట డాలు పురాతన ఆలయాలు,ఎత్తైనా గుట్టలు,గృహాలు ఉన్నప్పటికి వాటికి సరియైన రోడ్డు మా ర్గాలు ఏర్పాటు చేయకపోవడంతో పర్యా టక ప్రేమికులు ఒక ఇంటి ఆస హానానికి గురి అవుతున్నారు. కొత్తగా ఏర్పడిన కోము రంబీం జిల్లాలో అధికా రుల సంఖ్య పెరగడంతో పాటు రోజురోజుకు జనాభా కూడ పెరు గుతూ వస్తుంది. సెలవులు వస్తే కుటుంబ సభ్యులతో పిల్లలతో ఆహ్లాదకరంగా ఎక్కడికైనా వెళ్ళాలంటే సరియైన సదుపాయాలు లేక ఇబ్బం దులు తప్పడంలేదు. ఇక్కడి పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటి అన్ని హంగులతో రూపు దిద్దుతే ప్రభుత్వానికి ఆదాయం సమాకూరే అవకా శాలు సైతం మెండుగా ఉన్నాయి.