Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

సాగర్‌లో పర్యాటకుల కోలాహలం

  Tourist hustle in Sagar in Nalgonda District

నాగార్జునసాగర్: అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో ఆదివారం పర్యాటకుల కోలాహలం నెలకొంది. హిల్‌కాలని లాంచీస్టేషన్ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. గత కొద్ది రోజులుగా ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది ఆదివారం ఇక్కడి వాతావరణ చల్లబడటంతో పర్యాటకులు నదీతీరంలో మరింత అహ్లాదంగా గడిపారు. తెలంగాణ పర్యాటక అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న లాంచీ స్టేషన్ ఆదాయం శని, ఆదివారాలలో 46 వేల రుపాయలు ఆదాయం వచ్చినట్లు పర్యాటక శాఖా అధికారులు తెలిపారు. పర్యాటకుల కోలాహలం సాగర్ కొత్త బ్రిడ్జివద్ద, విద్యుత్ కేంద్రాల వద్ధ, బుద్ధవనం, అనుపు, ఎత్తిపోతల జలాపాతం వద్ద పర్యాటకుల కోలాహలం నెలకొంది.

Comments

comments