Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

మేడారాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తా

Tournament is developed for tourism to medaram

గంగదేవి ఆలయ నిర్మాణానికి కృషి
ప్రభుత్వ చిప్‌విఫ్ కొప్పుల ఈశ్వర్

మనతెలంగాణ/ధర్మారం: మేడారంను పర్యాటకంగా అభివృద్ది చేసి, గంగదేవి అలయ నిర్మాణానికి సహకరం అందిస్తానని ప్రభుత్వ చీప్‌విఫ్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మారం మండలం మేడారం రిజర్వాయర్ గుట్టపైన నిర్మించే గంగమాత ఆలయ నిర్మాణానికి గురువారం నాడు భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈశ్వర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అభివృద్ది పర్చిన మేడారం రిజర్వాయర్‌పై ఆదారపడిన మత్స కారులకు చేపలు పట్టుకునేందుకు శాశ్వతంగా అవకాశం కల్పిస్తామని, లైసెన్స్‌లు ఉన్నవారికి మోపైడ్‌లు అందిస్తామని, వలలు ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్దంగా ఉందని అన్నారు. రిజర్వయర్‌ను ఆనుకొని ఉన్న ప్రదేశాన్ని పర్యటకంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దంచేసి ప్రభుత్వానికి పంపి నిధులు మంజూరుకు కృషి చేస్తానని ఈశ్వర్ అన్నారు.

దొంగతుర్తిలో మొగా క్యాంప్ హాజరైన ఈశ్వర్
ధర్మారం మండలం దొంగతుర్తిలో ఎల్‌ఎమ్ కొప్పుల ట్రస్ట్ ద్వారా ఎర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఈశ్వర్ ప్రారంబించారు. ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థకు చెందిన అన్ని రకాల వైద్యులు మెగా శిబిరానికి హాజరై సుమారు వెయ్యి మందికి ఉచితంగా పరిక్షలు నిర్వహించి మందులు పంపిణి చేశారు. శిబిరాన్ని ప్రారంబించిన అనంతరం రోగులతో స్వయంగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈశ్వర్ మాట్లాడుతూ మెగా వైద్య శిబిరాల ద్వారా ధర్మారం మండలంలో నిరుపేదలకు వైద్య సహయం అందిచాలనే వుద్దేశ్యంతో కార్యక్రమం చెపట్టమని అన్నారు. ఎల్‌ఎమ్ ట్రస్ట్ ద్వారా సహకారం ఉంటుందనీ ఈశ్వర్ అన్నారు.

వంతెనను ప్రారంబించిన ఈశ్వర్
బొట్లవనపర్తి గ్రామ పంచాయతి పరిధిలోని బుచ్చయ్యపల్లి -కానంపల్లి, గొల్లపల్లి మద్య 95లక్షల వ్యయంతో నిర్మించిన వంతెనను ఈశ్వర్ ప్రారంబించారు. బొట్లవనపర్తిలో పలు సిసి రోడ్లను ప్రారంబించడంతో పాటు ఖిళావనపర్తిలో ఇటివల ఆత్మహత్య చేసుకున్న రైతు వెంకటేశం కుటుంబాన్ని పరమార్శించారు. కార్యక్రమంలో మండల టిఆర్‌ఎస్ అధ్యక్షులు గుర్రం మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ల పోరం మండల అధ్యక్షులు పెంచాల రాజేశం,
రైతు సమన్యయ సమితి సభ్యులు పాక వెంకటేశం, ప్రధాన కార్యదర్శి మిట్ట తిరుపతి, ఉపాధ్యక్షులు సాన రాజేందర్, యువజన విభాగం అధ్యక్షులు రాసూరి శ్రీధర్, ఎంపిటిసిలు కట్ట సరోజ స్వామి, దేవి సునిత రమణ, మండల కో ఆప్షన్ సభ్యులు సలామోద్దీన్, డిఆర్‌ఓ పద్మయ్య, తహసీల్దార్ కె వై ప్రసాద్, ఎంపిడిఓ బాల రాజు, డిఈఈ శంకరయ్య, నాయకులు మిట్ట భరత్, జుంజుపల్లి రమేష్, యండి అజామ్ పాల్గొన్నారు.

Comments

comments