Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి… ముస్తాబైన ధన్వంతర వేంకటేశ్వరస్వామి ఆలయం

పెద్ద ఎత్తున హజరౌతున్న భక్తులు

ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ

Temple1

అయిజ: మానవులు సంసారం అనే సాగరంలో ఇంద్రియాలు అడ్డుపడటం వల్ల కొట్టు మిట్టాడుతూ జీవిత యాత్రను కొనసాగిస్తుంటారు. ఇంద్రియాలను అడ్డుకునేవి చాలా ఉన్నాయి. అయితే అడ్డు అన్నింటిని తొలగించి ఆ పరమాత్మున్ని చేరుకునెందుకు ఉత్తమమైన మార్గమే ఈ ఉత్తరద్వారం ధర్శనం ద్వారా చేసుకునే ఆ పరమాత్ముని ధర్శనం ఇదే వైకుంట ఏకాధశి . నేటి ముకోటి,వైకుంఠ ఏకాధశి కోటి పుణ్యాలతో సమానం . హైదవుల పండుగలన్ని చంద్రమానం లేదా సౌరమానం ప్రకారం విశిష్టతగా జర్పుకుంటారు . ఈ రెండింటి కలయికతో జర్పుకునేదే ఉత్తర ద్వార వైకుంఠ ఏకాధశి. మధుకైత తబులైన రాక్షాసుని శాపం తొలగించి వారికి వైకుంఠ ద్వారం వద్ద ధర్శనం కల్పించారు విష్ణువు .

తమలాగే ఈరోజు వైకుంఠ ద్వారం పోలిన ఉత్తర ద్వారాన్ని నిర్మించి స్వామి వారిని ధర్శించు కుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారట వారు. అప్పటినుంచి ఉత్తరం ద్వారం నుంచి శ్రీవారిని ధర్శించుకోవటం జరిగింది . మొరాసురు డైన రాక్షాసున్ని సంహరించెదుకు విష్ణుమూర్తి నుంచి ఒక ఆంశ వెలువడింది ఆమే ఏకాధశి అనే దేవత . ఎవరైతే వ్రతం చేస్తారో వారు వైకుంటాన్ని చేరుతారు వ్రతం ఆచరణ ఉపవాసం తులసీ తీర్థంమాత్రం సేవించాలి . బియ్యంలో మొరాసురుడు నివసిస్తాడంటారు. అందుకే బియ్యం తోచేసిన వంటలు నిషేదం తులసీ తీర్థం సేవించి ఉపవాసం చేయాలి మరునాడు అన్నధానం చేసి వుపవాసం విరమించాలి. వైకుంఠ ఏకాధశి నాడు ఉత్తర వైకుంఠ ద్వారం గూండ సమస్త 33 కోట్ల దేవతలు వైకుంఠ నాధుని దివ్యసుంధర స్వరూపాన్ని ధర్శించుకుంటారు.

నేడు ఉత్తనూర్‌లో ధన్వంతర వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు…

Temple3వైకుంట ఏకాధశి పర్వధినాన్ని పురస్కరించుకొని మండల పరిధిలోని ఉత్తనూర్ గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ ధన్వంతర వేంకటేశ్వర స్వామి ఆలయంలో నేడు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు శనివారం ఆలయకమిటి తెలిపింది .ఇందులో స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, తోమాలసేవ,ఉత్తరద్వార పూజ,కుష్మాణ్డబలి, కవటోద్ఘాటనం,ప్రవేశం బిదెసేవ పంచామృతాభిషేకం, వస్త్రసమర్పణ, పుష్పాలంకరణ సేవలుంటాయన్నారు. తెల్లవారు జామున 4-30 నిమిషాలకు ఉత్తరద్వార ప్రవేశం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మద్యాహ్నం 12 స్వామివారికి కళ్యాణం అనంతరం అన్నధాన కార్యాక్రమం . నిర్వాహనకు ఆలయాలను ముస్తాబు చేశారు. అలాగే భక్తులకు అసౌకర్యాలు కల్గకుండ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈఏడాది పెద్ద ఎత్తున భకుఎ్తలు హాజరౌతున్నట్లు తెలిపారు. కావున భక్తులందరు సకుటుంభ సపరివార సమేతంగా ఉత్తర ద్వారం గూండా స్వామి వారిని ధర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామికృపకు పాత్రులు కావలెనని ఆలయకమిటి పేర్కోంది.

Comments

comments