Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

హ్యాండ్‌వాష్‌లలో కీడే ఎక్కువ

Handwash

యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులు, ద్రావణాల (లిక్విడ్) వినియోగం వల్ల మేలు కంటే కీడే ఎక్కువని పరిశోధకులు 200మందికి పైగా చేసిన ప్రయాగాల్లో వెల్లడైనట్లు తెలిపారు. ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ పర్సపెక్టివ్స్ జర్నల్‌లో ఈ విషయం ప్రచురించింది. హ్యాండ్‌వాష్ సబ్బులు, లిక్విడ్‌లతో ఫలితాలు శూన్యమంటున్నారు. దీర్ఘకాలంలో కీడు ఎక్కువని, ముఖ్యంగా గర్భిణులు, పాలిచ్చే తల్లులకు హానికారకమని చెబుతున్నారు. వీటిల్లోని యాంటీబ్యాక్టీరియల్ రసాయనాలు గర్భిణుల శరీరంలో బిడ్డ ఎదుగుదలకు కారణమయ్యే అనేక హార్మోన్లను, ఇతర వాటిని ప్రభావితం చేస్తున్నాయని వారు హెచ్చరించారు. వారి శారీరక మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. వ్యాధుల నివారణ, ఇన్‌ఫెక్షన్ల నివారణలో సాధారణ సబ్బుల కంటే ఇవి ఎక్కువ ప్రభావం చూపుతున్నాయనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం గత ఏడాది వీటిని నిషేధించింది. ఇవేకాకుండా యాంటీబ్యాక్టీరియా రసాయనాలతో తయారవుతున్న లంచ్ బాక్సుల్లాంటి వాటితో కూడా పెను ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Comments

comments