Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రైతు ఆత్మహత్యలన్నీ … ప్రభుత్వ హత్యలే …

Uttam-Kumar-Reddy

హైదరాబాద్ : తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సిఎం కెసిఆర్ నాలుగు దఫాలుగా చేసిన రుణమాఫీ వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో కెసిఆర్ ఇచ్చిన హమీలను ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. రైతుల పట్ల కెసిఆర్ సర్కార్ అవలంభిస్తున్న నిర్లక్ష ధోరణికి వ్యతిరేకంగానే ఈనెల 27న ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి రైతులు భారీగా తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

TPCC Chief Uttam Comments on KCR Govt

Comments

comments