Home జయశంకర్ భూపాలపల్లి 40 మందితో వెళ్తున్నపెండ్లి ట్రాక్టర్ బోల్తా..

40 మందితో వెళ్తున్నపెండ్లి ట్రాక్టర్ బోల్తా..

TRACTOR

జయశంకర్ భూపాలపల్లి: పలిమెల మండల కేంద్రంలో ఓ పెండ్లి ట్రాక్టర్ శనివారం బోల్తా పడింది. కన్నాయిగూడెం మండలం ఐలపురం గ్రామం నుంచి మహదేవ్‌పూర్ మండలంలోని పెద్దంపేట గ్రామంలో జరిగే పెండ్లికి ట్రాక్టర్‌లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 40 మందితో వెళ్తున్న ట్రాక్టర్ పలిమెలలో ఉన్న మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా, మరో 20 మంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మహదేవ్‌పూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.