Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

Tractor Driver Dies In Road Accident In Vikarabad Dist

యాలాలః ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన యాలాల మండల పరిధిలోని పగిడ్యాల గ్రామ సమీపంలో శుక్రవారం చోటు చేసుకున్నది. ఈ సంఘటనకు సంబందించి యాలాల ఎస్సై సురేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బెన్నూరు గ్రామానికి చెందిన హుస్సేన్ (40) గత సంవత్సర కాలంగా పెద్దెముల్ మండలం కందనెల్లి గ్రామానికి చెందిన శివకుమార్ ట్రాక్టర్ పై డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఈ ట్రాక్టర్‌ను మిషన్ భగీరథ పనులకు సంబందించి కాంట్రాక్టర్ వద్ద ఎంగేజ్‌కు పెట్టారు. రాస్నం గడ్డపై నిర్మిస్తున్న నీటి బాండా గారానికి గాను ఇసుకను తీసుకెళ్ళి అక్కడ ఖాళి చేసి తిరిగి వస్తుండగా ఉతారు ఉండటంతో అధిక వేగం వల్ల అదుపు తప్పి పగిడ్యాల గ్రామ సమీపంలో బోల్తా పడింది. దీంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ  సురేందర్‌రెడ్డి తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని శవాని తాండూరు మార్చురీకి తరలించారు. మృతుని భార్య అబ్జబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపటినట్లు ఎస్ఐ తెలిపారు.

Comments

comments