Home జనగామ వంతెన పైనుంచి పడిన ట్రాక్టరు బోల్తా… ఒకరిమృతి, ఇద్దరికి గాయాలు

వంతెన పైనుంచి పడిన ట్రాక్టరు బోల్తా… ఒకరిమృతి, ఇద్దరికి గాయాలు

Tractor-Accident

జనగామ క్రైం: ప్రమాదవశాత్తు అదుపు తప్పి వంతెన పైనుంచి ట్రాక్టరు బోల్తాకొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శనివారం జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెలితే జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన రోశయ్యకు చెందిన ట్రాక్టరుపై జనగామ మండలం గానుగుపహాడ్‌కు చెందిన దావెర రాజు(32) డ్రైవరుగా పనిచేస్తున్నాడు.

శనివారం ఇటుకను తీసుకురావడానికి మహిళా కూలీలైన జనగామ బాణాపురానికి ంది న మా లోతు నీలమ్మ, నెల్లుట్లకు చెందిన బండి స్వరూపతో కలిసి జనగామ నుంచి నెల్లు ట్లకు వెళ్తున్న క్రమంలో జనగామ రోడ్డు ఓవర్ బ్రిడ్జిపై ట్రాక్టరు ముందు చక్రం పంక్చర్ కావడంతో అదుపు తప్పి ఒక్కసారిగా బ్రిడ్జి రెయిలింగ్‌కు ఢీకొని వంతెన పైనుంచి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవరు రాజు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలై న నీలమ్మ, స్వరూపలను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతుడు రాజుకు భార్య మహేశ్వరి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.