అమరావతి: పాత కక్షలతో దంపతులపై ట్రాక్టర్ ఎక్కించిన దారుణ ఘటన ఎపిలోని చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం వరిగాపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. రంజిత్ అనే వ్యక్తి పొలం పనుల్లో ఉన్న దంపతులు జగన్నాధ రెడ్డి, విమలమ్మలపై ట్రాక్టర్ ఎక్కించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతిచెందగా, భర్త తీవ్రంగా గాపడ్డాడు. అయితే స్థానికులు మాత్రం పాతకక్షలే కారణమని చెబుతున్నారు. కాగా, జగన్నాధ రెడ్డికి రంజిత్‌కు మధ్య కొంతకాలంగా భూ తగాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.