Search
Monday 24 September 2018
  • :
  • :

రూపాయికి వాణిజ్య లోటు దెబ్బ

bsns

న్యూఢిల్లీ : దేశీయ కరెన్సీ రూపాయి డాలర్‌తో పోలిస్తే ఆరు నెలల కనిష్ఠానికి పడిపోయింది. మార్చి నెలలో అంచనా కంటే ఎక్కువగా దేశీయ వాణిజ్య లోటు నమోదవడంకో రూపాయి విలువ క్షీణించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 65.49 వద్ద ముగిసి.. 2017 అక్టోబర్ 3 నాటి స్థాయికి చేరుకుంది. రూపాయి విలువ శుక్రవారం 65.22 శాతం ఉండగా.. తాజా 0.41 శాతం తగ్గి 65.49కు పడిపోయింది. మరోవైపు భారత్ వాణిజ్య లోటు రూపాయిపై ప్రభావం చూపింది. మార్చిలో వాణిజ్య లోటు 13.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంతకుముందు ఫిబ్రవరి నెలలో 11.98 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలపడుతుండడం.. రూపాయి మారకంపై  కూడా ప్రభావం చూపుతోంది. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల కూడా రూపాయిని బలహీన పరుస్తోంది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాల్లో కొనసాగుతున్న రూపాయి మారకం.. ఐదు నెలల కనిష్టానికి పడిపోయింది. మార్చిలో వాణిజ్య లోటు 13.7 బిలియన్ డాలర్లకు పెరగడం, యుఎస్ డాలర్ బలపడడం వంటి అంశాలు రూపాయిపై ప్రభావం చూపాయని నిపుణులు అంటున్నారు.

Comments

comments