Home భద్రాద్రి కొత్తగూడెం తూకాల్లో మోసాలు

తూకాల్లో మోసాలు

అనధికార కాంటాల వినియోగం

నామమాత్రపు తనిఖీలు
పర్యవేక్షణ కరువు

మోసపోతున్న ప్రజలు

సమాజంలో నిత్యావసర వస్తువుల వాడకం లేకుండా జీవితాన్ని గడపడం కష్టం. ఆయా వస్తువుల కొనుగోళ్లులో కూడా తూకాల పేరుతో మోసాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో డిజిటల్ తూకాలు ఎక్కువయ్యాయి. వాటిలో జరిగే మోసాలు సామాన్య ప్రజలకు అసలు అర్థంకావడం లేదు. ప్రభుత్వ రంగ,ప్రైవేటు దుకాణాల్లో కూడా వీటి వినియోగం ఎక్కువుగా ఉండటంతో వ్యాపారాలకు మోసం చేయడం సులువుగా మారింది.

measurement

అశ్వాపురం : మండలంలో నిత్యావరస సరుకులు తదితరాల తూకాలలో మోసాలు నానాటికి పెరిగిపోతున్నాయి. తూనికలు, కొలతల అధికారులు మొక్కుబడి తనిఖీలతో అశ్వాపురం మండల వినియోగదారులు నష్టపోతున్నారు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండే తూనికల అధికారి ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి నెలకొంది. తూనికల అధికారి అసలు ఉన్నాడా…లేడా అనే అయోమయంలో మండల ప్రజలు ఉన్నారు. ఆ అధికారి మూడు, నాలుగు నెలలకొకసారి వచ్చి తనిఖీలు చేస్తుండటంతో వ్యాపార సంస్థల్లో జరిగే మోసాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. దీని వలన క్రయ,విక్రయాల తేడాలతో తీవ్రంగా నష్టపోతున్నారు. కిరాణా, ఫ్యాన్సీ దుకాణాలతో పాటు ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో సైతం అనధికారిక కాటాలను వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…

ముందుగానే సమాచారం…

తూనికలు, కొలతల అధికారి తనిఖీకి వస్తున్నట్లు కార్యాలయ సిబ్బంది నుంచి ముందుగానే వ్యాపారులకు సమాచారం అందుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎలక్ట్రానిక్ కాటాలతో జరుగుతున్న మోసాలను అధికారులు గుర్తించినప్పటికీ కేసులు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నట్లు పలువురు వాపోతున్నారు. నిర్ణీత వ్యవధిలో కాటాలు, కొలతల అధికారులు తమకు వీలున్నప్పుడు వస్తుండటంతో మోసాలను అరికట్టే అవకాశం ఉండట్లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మొద్దునిద్ర మేల్కొని ప్రజలను మోసాల భారీ నుండి కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.