Home కరీంనగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనం

ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనం

TSRTC-Bus

కరీంనగర్: కరీంనగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనం ఈ పల్లె వెలుగు బస్సు. ఈనెల 18న నగరంలోని హెడ్ క్వార్టర్స్ సమీపంలో డ్రైవర్ నిర్లక్ష్యానికి ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు బలిగొన్న బస్సును ట్రాఫిక్ పోలీసులు నిర్లక్షంగా రద్దీగా ఉండే ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట నిలిపారు. కరీంనగరం రోడ్లు అసలే ఇరుకైన రోడ్లు దీంతో ఆ రోడ్డు పై వెళ్లాల్సిన వాహనాలకు , వాహన దారులకు తీవ్ర ఇబ్బంది గురిచేస్తుంది. ప్రతిక్షణం అవసర నిమిత్తం మార్కెట్ వెళ్లే మార్గంలో నిలిపే సరికి ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. గత కొన్ని రోజుల నుంచి నో పార్కింగ్ స్థలాల్లో వాహనలను నిలిపిన వారికి జరిమాన విధిస్తున్న ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదానికి కారణామైన ఈ పల్లె వెలుగు బస్సుకు ఏ ట్రాఫిక్ పోలీసు జరిమాన విధిస్తారో వెచి చూడల్సిందే.