Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

Drunk-and-Drive-checksహైదరాబాద్: నగరంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటున్నారు. దీనిలో భాగంగా అర్థ రాత్రి బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టడీ సర్కిల్ వద్ద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 24మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి 12కార్లు, 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి న్యాయస్థానంలో హాజరు పర్చనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

comments