Search
Wednesday 14 November 2018
  • :
  • :

చాలన్‌లకే పరిమితమైన ట్రాఫిక్ ఎస్సై

Traffic problem is getting worse
మన తెలంగాణ/పటాన్ చెరు : ట్రాఫిక్ నియంత్రించాల్సిన ట్రాఫిక్ ఎస్సై అది మరిచి చలాన్ రాస్తూ కాలం గడుపుతున్నాడు. ఉన్నత అధికారులు క్రింది స్థాయి అధికారులకు ఎంత, మొత్తంలో టార్గెట్ విధించారో తెలియదు కానీ ప్రతి రోజు ఉదయం నుంచే చలాన్‌లు రాస్తూ కాలం గడుపుతున్నాడు. ఉదయం ట్రాఫిక్ సమయంలో సైతం ట్రాఫిక్‌ను నియంత్రించకుండా నిర్లక్షం చేస్తున్నారని ప్రజలు, వాహనదారులు విమర్శిస్తున్నారు. రోడ్డుపై ట్రాఫిక్ వాహనాల రాక పోకలను సరిచేయాలని ఆదేశించాల్సిన ఎస్సై డ్యూటీ చేయాల్సిన పోలీసులను తన వెంటే చుట్టూ నిల్చోపెట్టుకుంటున్నాడు. ఇది ఎక్కోడో కాదు ప్రతి రోజూ రద్ద్దీగా ఉండే పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో జరుగుతున్నది. ఉదయం ౮ గం. నుంచే పరిశ్రమలకు వెల్లే వాహానాలతో పటాన్ చెరు బస్టాండ్ , పాశమైలారం , ఇస్నాపూర్ లు వాహనాలో రోడ్డు రద్దిగా ఉంటుంది. పటాన్ చెరు బస్టాండ్, ఇస్నాపూర్ కూడలి వద్ద గంట లతరబడి ట్రాఫిక్ నిలిచి పోతుతంది. దాంతో పరిశ్రమలకు వెల్లే కార్మికులకు ఆలస్యం అయిన సందర్భాలు ఉన్నాయి. అంతే కాకుండా బస్టాండ్ నుంచి బయటకు , లోనికి వెల్లే బస్సుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే బస్టాండ్ వద్ద డ్యూటి చేయాల్సిన ట్రాఫిక్ పోలీసులు అడపా దడపా కనిపిస్తుంటారు. ఇక్కడ ట్రాఫిక్ నియంత్రన పూర్తిగా లోపించడంతో పెద్ద సమస్యగా మారిందని వాహన దారులు అంటున్నారు. ఇక్కడే ట్రాఫిన్ నియంత్రించాలసిన పోలీసులను ఎస్సై తన వద్ద ఉంచుకొని చాలన్ రాయడానికి వాహనాలను ఆపడాని వాడుకుంటున్నాడు.ప్రతి రోజు ఎక్కోడో ఓ చోట చాలన్ లు రాయడంకే ఎస్సై పరిమితం అయ్యాడని ట్రాఫిక్ సమస్య పై దృష్టి పెట్టడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దాంతో ట్రాపిక్ అంతా గందరగోళంగా మారుతుండడంమే కాకుండా చిన్న ప్రమాదాలు సైతం జరుగుతన్నాయంటున్నారు. ఇక పోతో ఇస్నాపూర్ సర్కిల్ లో పాశమైలారం పారిశ్రామిక వాడకు వెల్లే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితె ఇక్కడ సరైన ట్రాఫిక్ పై నియంత్రన లేకపోవడంతో ట్రాఫిక్ నిలిచి పోతుంది. ఈ సర్కిల్ ను ఎప్పుడు దాటుతామో నని వాహనదారులు ఎదురుచూస్తుంటారు. ఈ సర్కిల్ లో సమస్యఉన్న అధికారులు మాత్రం ఇక్కడి కి వచ్చి సమస్యను పరిష్కరించడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక పోతే ట్రాఫిక్ ఎస్సై మాత్రం ట్రాఫిక్ సమస్య ఉన్న ఏ చోటికి పోకుండా చాలన్ రాయడమే తన వృత్తిగా వ్యవహరిస్తుంటాడంటు వాపోతున్నారు.
అభిప్రాయం నర్సింహారెడ్డి,
సిఐటియు జిల్లా అధ్యక్షులు
పరిశ్రమలకు వెల్లాల్సిన కార్మికులు ట్రాఫిక్ సమస్యతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ చక్క దిద్దల్సిన పోలీసులు ఉండండలేదు. ట్రాఫిక్ నిలిచి పోయిన ట్రాఫిక్ పోలీసులు కనిపించడం లేదు. ట్రాఫిక్ నిలిచి పోయిన పక్కనే నిల్చుండి చూస్తున్నారే తప్ప వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేయడంలో నిర్లక్షం చేస్తున్నారు. ట్రాఫిక్ ఎస్సై మాత్రం పోలీస్ స్టేషన్ వద్ద కనిపిస్తాడు

Comments

comments