మన తెలంగాణ/హైదరాబాద్:మెదక్ జిల్లా ట్రాఫిక్ ఎస్ఐ బాల కిషన్ 15 రోజుల క్రితం స్థానిక సాయిదీప్ సూ పర్ మార్కెట్లో రూ.50 విలువైన సెం ట్ బాటిల్‌ను చోరీ చేశాడు. ఈ చోరీ త తంగం అంతా అక్కడి సిసిటివి ఫుటే జ్లో రికార్డు అయ్యింది. విషయం గమనించిన సూపర్ మార్కెట్ యజ మాని సెక్యూరిటీ గార్డులను అప్ర మత్తం చేశాడు. సివిల్ దుస్తుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐని వారు తనిఖీ చేసి అతని జేబులోంచి సెంట్ బాటిల్‌ను తీశారు. తననే తనిఖీ చేస్తారా నేను ఎవరనుకున్నారు..ఎస్ఐని అంటూ చిందులేసి బెదిరించాడు సదరు ఎస్ఐ.
ఈ విషయం రూడీ చేసుకునేందుకు సూపర్‌మార్కెట్ యజమాని జరిగిన విషయాన్ని మెదక్ శాంతి భద్రతల పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఠాణా పోలీసులు సర్దిచెప్పి అక్కడి నుంచి ట్రాఫిక్ ఎస్ఐ బాలకిషన్‌ను వెంట తీసుకెళ్లి పంపించారు. ఈ విషయం మెదక్ జిల్లా ఎస్పి చందనా దీప్తికి తెలియడంతో విచారణకు ఆదేశించారు. విచారణ అధికారి దర్యాప్తులో సాయిదీప్ సూపర్ మార్కెట్లో సిబ్బంది దృష్టి మరల్చి ట్రాఫిక్ ఎఎస్ఐ మెదక్ సెంట్ బాటిల్‌ను చోరీ చేసి జేబులు పెట్టుకున్నాడని తేలింది.
అందుకు సంబంధించిన సిసిటివి ఫుటే జ్లను కూడా దర్యాప్తు అధికారి ఎస్పికి అందజేశారు. ఈ మేరకు నిజమా బాద్ డిఐజి శివశంకర్‌కు సదరు ఎస్ఐ చోరీపై ఎస్పి నివేదిక అందజేశారు. ఎస్పి నివేధిక ఆధారంగా చోరీకి పాల్పడిన ఎస్ఐ బాలకిషన్‌ను సస్పెండ్ చేస్తూ డిఐజి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఎస్ఐ ట్రాఫిక్ విదుల్లో ఉన్న సమయంలో వాహనదారులు, దుకాణాదారులు, ఫుట్‌పాత్ వ్యాపారుల నుంచి డబ్బులు దండుకున్నట్లు విచారణలో తేలింది. అలాగే వాహనదా రులకు రాసిన చలానా డబ్బులను కూడా మింగేశాడని తేలింది.