Home హైదరాబాద్ ప్రయాణం.. నరక ప్రాయం

ప్రయాణం.. నరక ప్రాయం

Traffic system on the issues

ట్రాఫిక్ వ్యవస్థ సమస్యలమయం
ప్రతిరోజు నగర రోడ్లపై 51 లక్షల వాహనాలు
ప్రస్తుతం గంటకు సగటు వేగం 21 కి.మీ.లు
నగరంలో 19 ఫ్లైఓవర్లు… రోజుకు 114 ప్రమాదాలు
ఒక్క వాహనం మరమ్మతుతో వాహనాల బారులు

మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ మరింత జఠిలంగా మారుతోంది. అమ్మో ఆ మార్గంలో వెళ్తున్నారా..? ముందు ట్రాఫిక్ సమాచా రం తెలుసుకుని వెళ్ళాల్సిందే అనే అభిప్రాయం ఇప్పుడు వాహనదారుల్లో వినిపిస్తోంది. ఓవైపు ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నా… మరో వైపు కూడళ్ళను మూసేస్తున్నా… ట్రాఫిక్ అవస్థలు తీరడంలేదు. నగర రహదారుల్లో ప్ర యాణం నరక ప్రాయమనే అసహనం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం నగర వాహన వేగం గరిష్ఠంగా 21 కి.మీ.లుగా ఉన్నది. ఏ మార్గంలో ఏరకమైన సమస్య ఉన్నదో పోలీసులకు తెలిసిన విషయమే. కానీ, వాటి నివారణకు ప్ర త్యేక చర్యలు తీసుకోవడంలో పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారనే వి మర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రా ఫిక్ సమస్య తలెత్తినప్పుడు వాహనదారులను అప్రమత్తం చేయడం, ప్ర త్యామ్నాయ మార్గాలను అనుసరించేలా చూడటం చేయాల్సిన పోలీసు యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుందనే ప్రచారమున్నది. సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటనలు చేస్తున్న పోలీసు అధికారులు ఆ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయడంలో వెనుకబడుతున్నారనేది వాహనదారుల అభిప్రాయం.

చుక్కలు చూపించే మార్గాలు
నగర రహదారుల్లో నిత్యం 55 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం 114 ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా అమీర్‌పేట్ మియాపూర్, బోయిన్‌పల్లి కూకట్‌పల్లి, సంగీత్ చౌరస్తా పంజాగుట్ట, లకిడీకాపూల్ మెహిదీపట్నం, జేబిఎస్ తిర్మలగిరి, ముషీరాబాద్ సుల్తాన్‌బజార్, చాదర్‌ఘాట్ మలక్‌పేట్, నాగార్జున్‌సర్కిల్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, ప్యారడైజ్ ట్యాంక్‌బండ్, లిబర్టీ బర్కత్‌పురా, అంబర్‌పేట్ చాదర్‌ఘాట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నిత్యం నరకప్రాయంగా మారింది. ఈ మార్గాల్లో ఒక్క వాహనం బ్రేక్ డౌన్ అయినా, ఏదేని మరమ్మతుకు వచ్చినా ఆ మార్గం పూర్తిగా మూసేసినట్టుగా మారిపోతుంది. ప్రస్తుతం నగరంలో 19 ఫ్లైఓవర్లున్నాయి. నగర రహదారుల్లో వాహన అత్యధిక వేగం గంటకు 21 కి.మీ.లుగా ఉన్నట్టు పోలీసు రికార్డులే వెల్లడిస్తున్నాయి. 42 ప్రాంతాల్లో లారీలు, బస్సులు ప్రవేశాన్ని నిషేధించారు. 35 ప్రదేశాల్లో మాధ్యస్థాయి వాహనాలను, 35 మార్గాల్లో లోకల్ లీరీలను, 15 ప్రాంతాల్లో నెమ్మదిగా వెళ్ళే వాహనాలకు ప్రవేశం లేదంటూ ట్రాఫిక్ పోలీసులు నిషేధించారు. 85 ప్రదేశాలను ప్రమాదాలకు అవకాశాలు న్న మార్గాలుగా వెల్లడించారు.
వర్షం వస్తే నీరు చెరువుల్లా నిలిచే(వాటర్ లాగింగ్) ప్రాంతాలను గుర్తించినా అవి ప్రకటనలకే పరిమితమయ్యాయి. కానీ, అమలు చేయడంలోనే పోలీసు యంత్రాంగం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండటం వల్లనే ట్రాఫి క్ సమస్య తలెత్తుతున్నట్టు వాహనదారులు వివరిస్తున్నారు. నగరంలో చాలా ప్రాంతాల్లో కూడళ్ళను మూసేసి యూటర్న్‌లు ఏర్పాటు చేశారు. అయినా ఇబ్బందులు తప్పడంలేదు. గంటల తరబడి ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి మారడంలేదు.

వాహనాలు నగరంలోకి
నగరంలోని వాహనాలే కాకుండా శివారు, జిల్లాల ప్రాంతాల నుండి 100 కి.మీ.లలోపు నుండి నిత్యం 43,567 వాహనాలు, 150 కి.మీ.లలోపు దూరం నుండి 14,904 వాహనాలు ప్రవేశిస్తున్నాయి. నగరం నుండి శివారులోకి వెళ్ళే వ్యక్తిగత వాహనాలు నిత్యం 1.47 లక్షలు, బస్సులు 11.72 వేలు, గూడ్స్‌వాహనాలు 53.86 వేలు వెళ్తున్నాయి. నగరంలో రోడ్డుమార్గాలు 6,081 కి.మీ.లు, బస్ నెట్‌వర్క్ 3,363 కి.మీ.లు, ఎంఎంటిఎస్ 147 కి.మీ.లు, మెట్రోరైలు 30 కి.మీ.లు రవాణా వ్యవస్థ అందుబాటులో ఉన్నది.

ప్రమాదాలు ఇలా
నగరంలో ట్రాఫిక్ సమస్యల వల్ల రోడ్డు ప్రమాదాలు నిత్యం 114 చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం రోజు అధికంగా 136 సంభవిస్తున్నాయి. వారం రోజుల్లో 804 ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో 2 వీలర్స్ వాహనాలు 308, 4 వీలర్స్ 291, 3 వీలర్స్ 59, ఆర్‌టిసి వాహనాలు 44, లారీలు 29, డిసిఎంలు 13, టెంపో ట్రాలీలు 19 ఇలా వారంలో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

ట్రాఫిక్ పోలీసులు
నగరంలో మొత్తం 25 పోలీసు స్టేషన్‌లున్నాయి. ఒక అదనపు కమిషనర్, ఇద్దరు డిసిపిలు, ఆరుగురు మంది ఎసిపిలు ట్రాఫిక్ వ్యవస్థపై సేవలు అందిస్తున్నారు. అయితే, ట్రాఫిక్ క్రిందిస్థాయి అధికారులు వాహనాల రాకపోకల అంతరాయాలను నివారించడంకన్నా వాహనాలను ఫోటోలను తీసేందుకే పరిమితమవుతున్నారు.
ఇటీవల విధుల్లో ఉంటూ వ్యక్తిగత ఫోన్‌లకే అధిక సమయాన్ని కేటాయిస్తున్నట్టు విమర్శలున్నాయి.