Home జాతీయ వార్తలు కాళరాత్రి

కాళరాత్రి

  • ఎపిలో అర్ధరాత్రి ఘోర రైలు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కూనేరు రైల్వేస్టేషన్ వద్ద ఘెర ప్రమాదం జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం రాత్రి 11.20 గంటల సమయంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 40 మంది దుర్మరణం చెందారు. 

Train-Accidentకూనేరు: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కూనేరు రైల్వే స్టేషన్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్ పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం రాత్రి 11.20 గంటల సమయంలో పట్టాలు తప్పింది. ఘటనలో 40మంది దుర్మరణం చెందారు. మరో 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం జరిగింది. కటిక చీకటి.. ఏం జరిగిం దో తెలియక అంతా గందరగళానికి గురయ్యారు. కళ్లు తుడు చుకుని ప్రమాదం జరిగిందని గుర్తించిన తర్వాత ప్రాణాలు రక్షించుకోవాలన్న ఆత్రుతలో ప్రయాణికులు పరుగులు పెట్టడం తో బోగీల్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. మరోవైపు క్షతగాత్రు ల రోదనలతో ప్రమాదస్థలి దద్దరిల్లిపోయింది. ఘటనాస్థలి భీతా వహంగా మారిపోయింది. వస్తువులు చెల్లాచెదురుగా పడిపో యాయి. నుజ్జునుజ్జయిన బోగీల్లో పలువురి మృతదేహాలు ఇరు క్కుపోయాయి. వాటిలో కొన్ని గుర్తు పట్టలేనంతగా మారిపో యాయని ప్రత్యక్ష సాక్షులు పలువురు చెప్పారు. సమాచారం తెలిసిన వెంటనే సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. బోగీ లను కట్ చేసి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ సమాచారం అందిన వెంటనే విశాఖ నుంచి హుటాహుటిన సహాయక బృందం బయలుదేరింది. డీఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ సహా 18 మంది రైల్వే అధికారులు, 8 మంది వైద్యులు ప్రమాద ప్రాంతానికి వెళ్లారు. రాయగఢ్ కలెక్టర్, జెసి, విజయనగరం ఒఎస్‌డి తదితరులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. సహాయక చర్యలు దాదా పుగా పూర్తయ్యాయని ఈస్ట్‌కోస్ట్ రైల్వే చీఫ్ పిఆర్‌ఒ జె.పి.మిశ్రా వెల్లడిం చారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి, వారికి మెరుగైన వైద్యం అందేలా చూడడం తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. బోగీల్లో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అన్నది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. మూడు స్లీపర్ కోచ్‌లు బాగా దెబ్బతిన్నాయని, వాటిల్లోనే ఎక్కువ నష్టం వాటిల్లిందని వివరించారు. ఈ ప్రమాదంలో ఏడు బోగీలు పడిపోయాయి. ఇందులో ఒక ఏసీ, నాలుగు జనరల్, రెండు స్లీపర్ క్లాస్ బోగీలు ఉన్నాయి. మరోవైపు ప్రమాదంపై రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీ, స్పీకర్ సుమిత్రా మహాజన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రు లు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
భారీ శబ్దంతో ప్రమాదం…
అర్ధరాత్రి.. అసలే అటవీ ప్రాంతం.. ఒక్క సారిగా భారీ శబ్దంతో ఏం జరిగి ందో అర్థం కాలేదు. నిద్ర నుంచి మేల్కొన్న ప్రయాణికుల అరుపులు.. కేకల తో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఎలాగైనా బయట పడాలని ఆరాట ంలో బోగీల్లో ఒకరిపై ఒకరు పడిపోయారు. తీవ్ర తొక్కిసలాట చోటు చేసు కోవడంతో కొందరు, బోగీలు పడిపోయిన తాకిడికి గాయాలై మరికొందరు విగతజీవులయ్యారు. పదుల సంఖ్యలో గాయపడిన వారి హాహాకారాలతో ఘటనా స్థలి దద్దరిల్లింది. తాము ప్రయాణిస్తున్న రైలు ప్రమాదానికి గురైందని తెలుసుకుని బోగీల్లో చిక్కుకుపోయిన వారు వణికిపోయారు. ఘటన జరిగిన సమయం అర్ధరాత్రి కావడంతో సహాయక చర్యలు ఆలస్యంగా మొదలయ్యాయి. విజయనగరం రైల్వేస్టేషన్‌లో అధికారులు హెల్ప్‌లైన్ (8106053006 (ఎయిర్‌టెల్), 8500358712 (బిఎస్‌ఎన్ ఎల్) ఏర్పాటు చేశారు.
క్షతగాత్రులకు రైల్వేమంత్రి పరామర్శ..
రైలు ప్రమాద ఘటనలో గాయపడి రాయగడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కేంద్ర రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు పరా మర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైలు ప్రమాద బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాద ఘటనపై పూర్తి విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదస్థలిలో సహాయచర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవ లు అందించాలని ఆదేశించారు. మృతుల కుటుబాలకు రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50వేలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 వేలు అందజేస్తామని ప్రకటించారు. రైలు ప్రమాద ఘటనపై స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు అక్కడికి చేరు కుని సహాయ చర్యలు పర్యవేక్షించాలని సూచిం చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశిం చారు. మృతదేహాలను స్వస్థ లాలకు పంపేందుకు ఏర్పాటు చేయాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5ల క్షల ఆర్థిక సాయం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.