Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

రష్యాలో రైలు ప్రమాదం : 19 మంది మృతి

RAIL

మాస్కో : రష్యాలో శుక్రవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో 19 మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పెటుషిన్‌స్కీ ప్రాంతంలోని పొక్రోవా రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రైలు వస్తున్న విషయం తెలిసి కూడా బస్సు డ్రైవర్ రైలు పట్టాలను దాటేందుకు యత్నించాడు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన రైలు బస్సును ఢీకొంది. బాధితులంతా సెంట్ పీటర్స్‌బర్గ్, నిజ్నీనొవ్‌గొరోడ్ ప్రాంతాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. నంబర్ ప్లేట్ ఆధారంగా ఆ బస్సు కజికిస్తాన్‌లో రిజిస్ట్రర్ అయినట్టు గుర్తించారు.

Train Accident in Russia : 19 Killed

Comments

comments