Search
Wednesday 14 November 2018
  • :
  • :

బడి బండి!

Train-Art-on-School-Wall

స్కూలుకు వెళ్లడమంటే పిల్లలకు విపరీతమైన బద్ధకం. ఎప్పుడెప్పుడు సెలవులొస్తాయా అని ఎదురుచూస్తుంటారు. మరి వాళ్లను బడికి రప్పించడం ఎలాగా అని ఆలోచించింది కేరళ ప్రభుత్వం. అదే రైలు బండి కాన్సెప్ట్. స్కూలును రైలు బండిలా మార్చేసారు. ఉసూరు మంటూ పాఠశాలకు వెళ్లిన చిన్నారులకు అక్కడ స్కూలుకు బదులు ఓ రైలు బండి కనిపించింది. అంతే ఇంతింత కళ్లేసుకుని ఆశ్చర్యపోయారు.  ఇంతకీ అదేమంటే…అదేమీ నిజమైన రైలు కాదు. ఈ మధ్యకాలంలో కేరళలోని కాసరగోడ్ జిల్లాలోని పిలికాడ్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండటం లేదు. దీంతో అక్కడ బడుల్లో రాన్రాను పిల్లలు కరువయ్యారు. ఈ సమస్యకు పరిష్కారంగా కేరళ ప్రభుత్వం బడి స్వరూపాన్నే మార్చేసింది.  ఇలా రైలు ఆకారంలో ఉన్న బడికైనా బుజ్జాయిలు వస్తారనుకుంది.  అనుకున్నట్లే జరిగింది. ఒకప్పుడు 400 ఉన్న సంఖ్య ఇప్పుడు 550 కి పెరిగింది.  సోమాలియాలోని రైలు బండి స్కూళ్లు ఈ పిలికాడ్ బడికి స్ఫూర్తి. ఈ బడిని రైలు బండిలా మార్చిన ఘనత సంజీష్ వెంగర అనే కళాకారుడిది.  విశాఖపట్నం జిల్లా లోని యలమంచిలి మండలంలోని మట్లపాలెం ప్రభుత్వ పాఠశాలవారు కూడా ఇలాగే రైలు బడిని ఏర్పాటుచేసుకున్నారు.

Train-Paint-on-School-Wall

Comments

comments