Home జగిత్యాల పెద్దపల్లి-నిజామాబాద్ రైలు ప్రారంభం

పెద్దపల్లి-నిజామాబాద్ రైలు ప్రారంభం

Train

జగిత్యాలటౌన్: దశాబ్దాల ఎదురు చూపు లకు ఎట్టకేలకు మోక్షం లభించింది. పెద్దపల్లి- నిజామా బాద్ రైలు శనివారం పట్టాలపై పరుగులు తీయడంతో జిల్లా వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. నిజామాబాద్ నుంచి బయలుదేరిన రైలుకు మెట్‌పల్లి ప్రాంతంలో జిల్లా ప్రజలు అధికారులు ఘన స్వాగతం పలికారు. జిల్లా ఎస్‌పి అనంతశర్మ, ఇతర పోలీస్ అధికారులు మెట్‌పల్లి నుంచి జిల్లా సరిహాద్దు పూడూర్ వరకు ప్రయాణించారు. జగిత్యాల రైల్వే స్టేషన్‌కు స్థానిక ప్రజలు,టిఆర్‌ఎస్ నాయకులు, కా ర్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి రైలుకు స్వాగతం పలికా రు. పెద్దపల్లి- నిజామాబాద్ రైల్వే లైన్ నిర్మాణానికి అప్పటి ప్రధానమంత్రి పివి నర్సింహారావు పచ్చ జెండా ఊపగా వి డతల వారీగా నిధులు మంజూరు అయ్యాయి. మొదటగా పెద్దపల్లి నుంచి కరీంనగర్ వరకు లైను పూర్తి కాగా ఆ తర్వాత కరీంనగర్ నుంచి జగిత్యాల వరకు మాత్రమే లైను పూర్తి కావడంతో రోజుకు ఒక సారి జగిత్యాల నుంచి పె ద్దపల్లి వరకు పుష్‌పుల్ రైలు సౌకర్యం ఏర్పడింది.

ఈ మధ్య జగిత్యాల నుంచి మోర్తాడ్ వరకు లైన్ పూర్తి కాగా ఇదే రైలు మోర్తాడ్ వరకు పొడగించబడింది. తాజాగా మోర్తాడ్ ను ంచి నిజామాబాద్ మధ్య రైల్వే లైను పనులు పూర్తి కా వడంతో రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు హైదరాబాద్‌లో రి మోట్ కంట్రోల్‌తో రైలును ప్రారంభించడంతో నిజామాబా ద్ నుంచి రైలు పట్టాలెక్కి నాలుగు జిల్లాల ప్రజల్లో సంతోషా న్ని నింపింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో రైలు సౌకర్యం లేక రోడ్డు రవాణాపైనే ఆధారప డి తీవ్ర ఇబ్బందులు పడ్డామని, నిజామాబాద్ – పెద్దపల్లి రై లు సౌకర్యం ఏర్పడటంతో ముంబాయి, బీవండి తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ రైలు చాల సౌకర్యంగా ఉం టుందన్నారు.

రైలు సౌకర్యం వల్ల రవాణా వ్యవస్థ మెరుగు పడటంతో పాటు వ్యాపార,వాణిజ్య రంగాల్లో మరింత అ భివృద్ధి సాధ్యపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశా రు. కరీంనగర్ వరకే పరిమితమైన తిరుపతి రైలును జగి త్యాలకు వరకు పొడగించడంతో పాటు షిర్డీకి వెళ్లేందుకు రైలు సౌకర్యం కల్పించాలని జగిత్యాల జిల్లా వాసులు కోరు తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌పి అనంతశర్మతో పాటు డిఎస్‌పి మల్లారెడ్డి, సిఐలు సురేందర్, రాజశేఖర్‌రా జు, ప్రకాశ్, సర్వర్, ఆర్‌ఐ ప్రతాప్, పలువురు ఎస్‌ఐలు, రై ల్వే అధికారులు రామారావు, మధుసూదన్‌రావు, శ్రీనివాస్, టిఆర్‌ఎస్ నాయకులు శీలం ప్రవీణ్, సురేశ్, వెంకటేశ్వర్ రావు, నక్కల రవీందర్‌రెడ్డి, కూతురు రాజేశ్, ఆరీఫ్, అం జయ్య, స్వామి, జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

కొత్తపల్లిలో…
కరీంనగర్ -నిజామాబాద్ -పెద్దపల్లి జిల్లాల ప్రజల 23 కళ నేటితో సహకారం అయింది.పెద్దపల్లి-నిజామాబాద్ మధ్య కొత్త రైల్వేలైన్‌ను కేంద్ర రైల్వే శాక మంత్రి సురేవ్ ప్రభు ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్ సీటీ రైల్వే స్టుషన్ వేదికగా రిమోట్ లింక్ ద్వారా రైల్వేలైన్ ప్రా రంభించారు.దీనితో పాటు మహబూబాద్-సికింద్రబాద్ రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు.పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ మధ్య 180 కి లోమీటర్లు ఉంటుంది.ఈ దూరం బస్సు చార్జీలతో ప్రజలకు తడిచి మోపేడు ఆయ్యేయి.నేటి రైలు ప్రారంభంతో ప్రజల భారం తగ్గింది. కరీంనగర్ మండలంలోని తీగలగుట్టపల్లి రైత్వే స్టేషన్‌లో శనివారం బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళిధర్‌రావు కరీంనగర్-నిజామాబాద్ రైల్వేలైన్‌ను కోబ్బరికాయ కొట్టి,పసుపుకుంకుమ చల్లి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ – ద్దపల్లి-జగిత్యాల-నిజామాబాద్ జిల్లాల ప్రజల కళ నేటితో సహకారం అయిందని,మోదీ పాలనతో ప్రజలకు మరిన్ని సౌకర్యాఅందుతాయన్నారు.పెద్దపల్లి-నిజామాబాద్ రైలే లైన్‌ను అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు 1993లో శంకుస్థాపన చేశారని,తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వడంతో రైల్వేలైన్ క్లీయర్ అయిందన్నారు.ఈ రైల్వేలైన్‌ద్వారా క రీంనగర్ జిల్లా ప్రకజలకు షిరిడి పుణ్య క్షేత్రానికి కి మార్గం సుమగం అయిందన్నారు.ప్రధాని మోడి పాలనలో ప్రజలు మంచి జరుగుతుందన్నారు. ప్రజల మనిషి మోడి అన్నా రు. ఈ సందర్భంగా హామాలీలు బిజెపి జాతీయ ప్రధాన కా ర్యదర్శి పి.మురళిధర్‌రావుకు సలువాతో ఘన సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆధికార ప్రతినిధి బండి సంజయ్,జిల్లా అధ్యక్షులు కొత్త శ్రీనివాసరెడ్డి,ప్రజ్ఞాన భా రతి అధ్యక్షుడు డా.విజయేందర్‌రెడ్డి,నగర అధ్యక్షులు బేతి మహేందర్‌రెడ్డి,మల్లేశం,ప్రభాకర్,ప్రవీణ్‌రావు,తదితరులు పాల్గొన్నారు.

మెట్‌పల్లిలో…

నిజామాబాద్-పెద్దపల్లి మధ్య శనివారం దక్షిణ మధ్య రై ల్వే శాఖ అధికారులు ప్రారంభించారు.పట్టణానికి చేరు కున్న నిజామాబాద్-పెద్దపల్లి రైలును చూడడానికి ప్రజలు యు వకులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.మెట్‌పల్లిలో ఎస్ పి అనంతశర్మ, బిజెపి నాయకులు రైలుకు సా గతం పలి కారు.సికింద్రబాద్ రైల్వేస్టేషన్‌లో కేంద్ర మంత్రి సురేష్ ప్రారంభించాగా. నిజామాబాద్‌లో మంత్రి పోచారం శ్రీని వాస్ రెడ్డి,ఎంఎల్‌ఎలు రైలుకు పచ్చ జెండా ఊపారు. రైలులో జిల్లా ఎస్‌పి అనంతశర్మ, డిఎస్పీ మల్లయ్య,సిఐలు సురేందర్,రాజశేఖర్ రాజు,రైల్వే బోర్డు సభ్యురాలు పూదరి అరుణ,బిజేపి జిల్లా అధ్యక్షుడు బాజోజి భాస్కర్‌లు ప్ర