Home తాజా వార్తలు వరద నీటిలో నిలిచిపోయిన రైలు ….

వరద నీటిలో నిలిచిపోయిన రైలు ….

Flooded-in-Train

భువనేశ్వర్ : ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.  రెండు రోజుల నుంచి వాన పడుతుండడంతో బస్సులు, ట్రైన్స్, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాయగడ జిల్లాలో భువనేశ్వర్, జగదల్‌పూర్ హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ వరద నీటిలో నిలిచిపోయింది. రైల్వే పట్టాలపై భారీగా వరద రావడంతో  హీరాఖండ్ ఎక్స్ ప్రెస్ ఆగిపోయింది. దీంతో పైలట్లు రైలును అక్కడే నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.  వరద ప్రవాహంలో ఉన్న రైలును చూసేందుకు స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు.