Home జాతీయ వార్తలు టికెట్ మీద ప్రధాని ఫోటో ఎందుకని అడిగితే…!

టికెట్ మీద ప్రధాని ఫోటో ఎందుకని అడిగితే…!

Train Tickets With PM Photoలక్నో: దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రైల్వే టికెట్లపై ప్రధాని మోడీ ఫోటోలు ముద్రించి విక్రయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కమీషన్ విధించిన కోడ్‌ను ఉల్లంఘించినట్టు ఆరోపణలు రావడంతో వాటి విక్రయాలను విరమించుకుంటున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. అయిన మళ్లీ ఈ టిక్కెట్లు ప్రధాని ఫోటోలతోనే టికెట్లు దర్శనమిస్తున్నాయి. ఆదివారం యుపిలో ఓ ప్రయాణికుడు వీటిని గుర్తించి మీడియా దృష్టికి తీసుకురావడంతో  ఈ వ్యవహారం బయటపడింది.
మహ్మద్ షబ్బర్ రిజ్వీ అనే యువకుడు లక్నో నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని బారాబంకికి టికెట్ బుక్ చేసుకున్నాడు. ఆయనకు ఇచ్చిన పేపర్ టికెట్ వెనుక భాగంలో మోడీ ఫోటో, ప్రధానమంత్రి ఆవాస్ (రూరల్) పథకం వివరాలు ప్రింట్ చేసి ఉండటం గమనార్హం. ఇలా ప్రచారం చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి విరుద్ధమని రిజ్వీకి అవగాహన ఉండడంతో స్టేషల్‌ అధికారులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించాడు. అయితే అధికారులు అతడి ఫిర్యాదును స్వీకరించలేదు. అంతేకాకుండా అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ బయటకు గెంటేశారు.
చివరికి రిజ్వీ మీడియాను అనుసరించడంతో అధికారులు దారికొచ్చారు. పొరపాటున ప్రధాని మోడీ ఫోటో ఉన్న పేపర్ రోల్‌ను ప్రింటింగ్ మెషిన్‌లో పెట్టడం వల్లే ఇలా జరిగిందంటూ డ్యూటీలో ఉన్న సూపర్‌వైజర్ వివరణ ఇచ్చారు. గతంలో కూడా ఇలాంటి టికెట్లపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన ముచ్చట తెలిసిందే. దీంతో మోడీ ఫోటోలు ఉన్న రైల్వే టికెట్లను విరమించుకుంటుకున్నట్టు రైల్వేశాఖ వెల్లడించింది.
Train Tickets With PM Modi Photo At UP Railway Station
Train Tickets With PM Photo At UP Railway Station