Home నిజామాబాద్ నిరుద్యోగ యువత కోసమే శిక్షణ తరగతులు

నిరుద్యోగ యువత కోసమే శిక్షణ తరగతులు

Training classes for unemployed youth

మనతెలంగాణ/బోధన్: నిరుద్యోగుల యువతీ యువకుల శ్రేయస్సు కోసమే ఉచిత శిక్షణ  కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించినట్లు టీఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకులు పోచారం సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. రుద్రూర్ మండలం కోటయ్య క్యాంప్‌లో గురువారం శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నేద నిరుద్యోగులు ఉండకూడదనే లక్షంతో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంతో ఈ కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించామన్నారు. శిక్షణ తరగతుల్లో 60 రోజుల పాటు నేర్చుకున్న అంశాలపై ఎప్పటికప్పుడు ప్రక్షళన చేసుకోవాలని యువతియువకులకు సూచించారు. నిరుద్యోగులకు ఏవిధమైన      సహాయానైనా అందించేందుకు తమ కుటుంబం అందుబాటులో ఉంటు ందని దేశాయిపేట్ విండో చైర్మన్ వెల్లడించారు. కరెంట్ అఫైర్స్‌తో పాటు ఇతర మెటీరియల్‌కు సంభందించిన మెటీరియల్‌లను అందుబాటులో ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. నియోజక వర్గంలోని అవసరమైన ప్రాంతాలలో గ్రంథాలయాలను సైతం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని పీజేఆర్ కోచింగ్ సెంటర్‌లో శిక్షన పొందిన యువతియువకులు వారి తల్లిదండ్రుల ముఖంలో చిరునవ్వు కన్పించే విదంగ ఉద్యోగాలు పొందాలన్నారు. లక్షల రూపాయలను ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో పెట్టి నష్టపోకుండ ఇతర యువతియువకులను కాపాడాల్సిన భాద్యత పీజేఆర్ సెంటర్‌లో శిక్షణ పొందిన వారిదే నని ఆయనన్నారు.