Search
Wednesday 26 September 2018
  • :
  • :

పోలీస్ నియామక ఎంపికలకు శిక్షణా తరగతులు

Training courses for police recruitment options

మన తెలంగాణ/ ఖమ్మం : ప్రభుత్వం చేపట్టనున్న పోలీ స్ నియామకాల్లో జిల్లా నుంచి అత్యథికంగా అభ్యర్థులు ఎంపికయ్యేందుకు గానూ శిక్షణా తరగతులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్, ఎస్సి,ఎస్టి,బిసి, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. పో లీస్ నియామక ప్రక్రియలో జిల్లాలోని నిరుద్యోగ యువ తి, యువతకు అవసరమైన ప్రవేశ పరీక్ష శిక్షణతో పాటు ఎంపికైన అభ్యర్థులకు శారీర దారుఢ్య శిక్షణ ఇచ్చేందుకు గానూ జిల్లాలో అవసరమైన శిక్షణా కేంద్రాల ఏర్పాటు గురించి నగర పోలీస్ కమిషనర్ తప్సీర్ ఇక్బాల్‌తో కలిసి సంబంధిత శాఖాధికారులతో సమీక్షా సమావేశం కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి కనీసం 1000 మందికి శిక్షణ కల్పించేవిధం గా ప్రణాళికలు సిద్ధ్దం చేసుకోవాలని సంబంధిత శాఖాధికారులను ఆయన ఆదేశించారు. ఖమ్మం నగరంతో పా టు మధిర, సత్తుపల్లి, ఏన్కూరులో పురుషులకు అదేవిధంగా నగరంలోని మహిళా ప్రాంగణంలో మహిళలకు శిక్షణ తరగతులు నిర్వహించేవిధంగా కేంద్రాల ఏర్పాటుకు మార్కెటింగ్ షెడ్లను ఎంపిక చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి కేంద్రంలో ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ, ఓసి అ భ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు గానూ 250 మంది చొ ప్పున అభ్యర్థులకు అవసరమైన ఏర్పాట్లు చేసుకునేవిధం గా ప్రతిపాదనలు రేపటిలోగా సమర్పించాలని కలెక్టర్ ఆ యా సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. ఎస్సి, బిసి స్టడీ సర్కిల్‌లో కూడా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే ఏర్పాట్లను చూడాలన్నారు. పోలీస్ నియామక పోటీ పరీక్షలకు నిర్దేశించిన సబ్జెక్టుల వారీగా ఆయా సబ్జెక్టులలో నిష్ణాతులై న బోధకులచే తరగతులు నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. శిక్షణలకు హాజరయ్యే అభ్యర్థులకు భోజన, ఇతర వసతుల ఏర్పాటుకు గానూ డిఆర్‌డిఏ ఆధ్వర్యంలో, మహిళా సంఘాల ద్వారా అం దించేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని డిఆర్‌డిఏ పి డిని ఆదేశించారు. 60 రోజుల పాటు పోలీస్ నియామక అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష శిక్షణ, అనంతరం ఎంపికైన అభ్యర్థులకు శారీరక దారుఢ్య శిక్షణను విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖాధికారులు సమన్వయంతో తమ బాధ్యతలను నిర్వర్తించాలన్నారు. పోలీస్ నియామకానికి సంసిద్ధమయ్యే అభ్యర్థులు ప్రభుత్వ ప రంగా ఏర్పాటు చేసే శిక్షణ తరగతుల పూర్తి సమాచారా న్ని, దరఖాస్తు చేసుకునే విధానాన్ని త్వరలోనే తెలియజేస్తామని నగర పోలీస్ కమిషనర్ తప్సీర్ ఇక్బాల్ తెలిపా రు. ఈ సమావేశంలో అడిషనల్ సిపి కొల్లు సురేష్‌కుమా ర్, ముఖ్య ప్రణాళికాధికారి జెడ్.రాందాస్, ఎస్సి కార్పొరేషన్ ఇడి శర్మ, బిసి వెల్పేర్ ఆఫీసర్ హృషికేష్‌రెడ్డి, డిఆర్‌డి ఏ పిడి ఇందుమతి, మైనార్టీ వెల్పేర్ ఆఫీసర్ రమేష్ కుమా ర్, డిఎస్‌డివో పరందామరెడ్డి, మహిళా ప్రాంగణాధికారిణి వెల్పుల విజేత, స్టడీ సర్కిళ్ల అధికారులు పాల్గొన్నారు.

Comments

comments