Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

వేటు పడింది…!

Trains in the heart of Irregulars

17 మంది ఉపాధ్యాయుల సస్పెన్షన్‌తో జిల్లాలో కలకలం
అక్రమార్కుల గుండెల్లో రైళ్లు
వైద్యుల పైనా విచారణకు కలెక్టర్ ఆదేశం
బాధ్యులని తేలితే శాఖాపరమైన చర్యలు

ఉపాధ్యాయుల బదిలీల్లో అక్రమ మార్గాలకు పాల్పడిన వారిపై విద్యాశాఖ చర్యలకు ఉపక్రమించింది. మెడికల్ బోర్డు సర్టిపికేట్ల వ్యవహారంలో బోగస్ ధ్రువపత్రాలు వెలుగులోకి రావడంతో ఉ మ్మడి జిల్లా పరిదిలో మొత్తం 17 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం రాత్రి బాగా పోద్దుపోయిన తరువాత ఆదేశాలు విడు దలయ్యాయి. 17 మందిలో 11 మంది ధ్రువపత్రాలు చెల్లవని, మిగిలిన 6 గురు మెడికల్ బోర్డులో నిర్వహించిన పరీక్షలకు గైర్హాజరయ్యారనే ఆరోపణలతో సస్పెండ్‌కు గురయ్యారు. ఈ చర్యలతో అ డ్డదారుల్లో బదిలీ కోసం పాయింట్లు పొందిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మన తెలంగాణ అందిస్తోన్న ప్రత్యేక కథనం..

మన తెలంగాణ/సంగారెడ్డి:  అధికార యంత్రాంగం తలుచుకుంటే ఎంతటి అక్రమార్కుల కైనా శిక్ష తప్పదనే అంశం మరో సారి రుజువైంది. ఉపాధ్యాయుల బదిలీల నేపథ్యంలో పాయింట్లు ఎక్కువగా పొంది, కొరుకున్న స్థానానికి బదిలీ కావచ్చనే కొందరి దురుద్దేశ్యం, చివరికి వారికే బెడసి కొట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిదిలో మొత్తం 17 మంది ఉపాధ్యాయులను సంగారెడ్డి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మంగళవారం రాత్రి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడంతో ఉపాధ్యాయ వర్గాల్లో కలవరం మొదలైంది. తప్పుడు విధానాలను అవ లంభించిన వారు ఎంతటి వారైనా శిక్షకు గురికాక తప్పదని మరోసారి ఆధికారులు నిరూపించారు. ఉపాధ్యాయ బదిలీల నేపథ్యంలో అనారోగ్యంతో బాదపడుతున్న వారికి, వితంతువులు, ఆవివాహితులు, అంగవైకల్యం 70 శాతానికి పైబడిన వారికి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం సాధించిన వారికి వివిధ స్థాయిల్లో పాయింట్లు అదనంగా కేటాయిస్తారు. ఈ పాయింట్లు సాధించేందుకు పలువురు ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో నష్టపోయే ఉపాధ్యాయులు కలెక్టర్‌కు పిర్యాదు చేశారు. ఆయన మరోసారి పాయింట్లు పోందిన వారి జాబితాను మెడికల్ బోర్డు ద్వారా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఆనారోగ్యం ఉంటే వారికి ఆదనపు పాయింట్లు లభిస్తాయి. బదిలీల్లో వారు కోరుకునే ప్రాంతానికి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. మెదక్ ఉమ్మడి జిల్లా పరిదిలో మొత్తం 195 మంది ఉపాధ్యాయులు అనారోగ్య కారణాన్ని చూపుతూ సర్టిపికేట్లు సమర్పించారు. వీరిలో కొందరు నకిలీ సర్టిపికేట్లు సమర్పించారని పిర్యాదులు రావడంతో కలెక్టర్ మరోసారి మెడికల్ బోర్డు ద్వారా రీ వెరీఫీకేషన్ చేయించుకుని రావాలని ఆదేశించారు. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ వైద్యులు సభ్యులుగా ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఈ నెల 16, 18 వ తేదిలలో మెడికల్ సర్టిపికేట్ల పరిశీలన జరిపారు. ఇందులో మెడికల్ బోర్డు ద్వారా జారీ అయిన అన్ని సర్టిపికేట్లు, మరోసారి పరిశీలన జరిపిన తరువాతే వారికి పాయింట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఈ రెండు రోజుల పరిశీలనలో 173 మాత్రమే సక్రమంగా ఉన్నట్లు తేల్చారు. పరిశీలనలో 14 మంది వరకు ఆనర్హులని తేలగా, 8 మంది సర్టిపికేట్ల పరిశీలనకు హాజరు కాలేదు. ఈ వ్యవహారం పై జిల్లా విదాశాఖాధికారి విజయలక్ష్మీ విచారణ నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగానే సంగారెడ్డి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తప్పుడు మెడికల్ సర్టిపికెట్లు సమర్పించిన వారితో పాటు, అనుపస్తితి ఆయిన ఆరుగురుని కలుపుకుని మొత్తం 17 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొదట్లో 22 మంది ఉపాధ్యాయులు తప్పుడు సర్టిపికేట్లు సమర్పించినట్లు తేల్చి, మరింత లోతుగా విశ్లేషించి 17 మంది పై వేటు వేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. అయితే మెడికల్ బోర్డులో నిర్వహించిన పరీక్షలకు తాను స్వయంగా హాజరై పరీషలు చేయించుకున్నా, తనను గైర్హాజరయ్యాడనే నెపంతో సస్పెండ్‌కు గురిచేయడం ఎంత వరకు సమంజసమని పెద్దశంకరంపేట మండల పరిదిలోని ఇసుకపాయల తండాకు చెందిన ఎస్.జి.టి ఉపాధ్యాయులు ఆశోక్‌కుమార్ ఆరోపించారు. తనకు ఓపెన్ హార్ఠ్ సర్జరీ ఆయ్యిందని, షర్ట్ విప్పి వైద్యులకు అంతా చూపించినట్లు చెప్పారు. కాలుపైన కోసి కుట్లు వేసిన ప్రాంతం కూడా చూయించినట్లు చెప్పారు. ఆయితే మెడికల్ బోర్డు వారు తాను పరీశీలనకు వచ్చినట్లు చూపకపోవడంతో ఈ వివాదం తలెత్తిందన్నారు. వెంటనే తన సస్పెన్షన్‌ను ఎత్తి వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే సస్పెండైన వారిలో మెదక్ జిల్లా నుంచి 7 గురు, సిద్దిపేట నుంచి 4 గురు, సంగారెడ్డి జిల్లా నుంచి 6 గురున్నారు. వీరికి తోడు సంగారెడ్డి మెడికల్ బోర్డు పరిదిలోని నలుగురు ప్రముఖ వైద్యులకు సైతం కలెక్టర్ తాఖీదులు జారీ చేశారు. మెడికల్ బోర్డు ఆధ్యక్షులు డాక్టర్ మురహారి పేరు కూడా ఇందులో ఉండడం గమనార్హం. సభ్యులైన డాక్టర్ పరుశురాం, డాక్టర్ కిరణ్‌కుమార్, డాక్టర్ నరేందర్ బాబులు షొకాజ్‌లు అందుకున్న వారిలో ఉన్నారు. వీరంతా సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పని చేస్తున్న వారే.

Comments

comments