Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

భవన నిర్మాణ వ్యర్థాలు వస్తే… భారీ జరిమానాలు

Transfer of 1 lakh metric tons of waste

లక్ష మెట్రిక్ టన్నుల వ్యర్థాల తరలింపు
ఆక్రమణల తొలగింపుతో 1200 మెట్రిక్ టన్నుల వ్యర్థాల తరలింపు

మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రధాన సమస్యలలో ఒకటిగా ఉన్న భవన నిర్మాణ వ్యర్థాల తరలింపు ముమ్మరంగా సాగుతోంది. భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి, రీసైక్లింగ్ చేయడంలో దేశంలోనే 4వ నగరంగా హైదరాబాద్ నిలిచింది. తొలిదశలో జీడిమెట్ల, ఫతుల్లాగూడలలో సి అండ్ డి వెస్ట్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి 2018 ఫిబ్రవరి 22న రాంకీ సంస్థతో జిహెచ్‌ఎంసి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందం నాటి నుంచి తొమ్మిది నెలల్లో సి అండ్ డి ప్లాంట్లను నిర్మాణం చేసి, వాటి నిర్వహణను రాంకీ చేపట్టనుంది. ప్లాంట్ల నిర్మాణం తర్యాతనే సి అండ్ డి వ్యర్థాల సేకరణ చేయాల్సి ఉంది. ఇప్పటికే లక్షల టన్నులు పేరుకపోయిన పాత వ్యర్థాలను తక్షణమే తరలించాలనే సంకల్పంతో 75 శాతం టిప్పింగ్ ఫీజుతో ఒప్పందం కుదుర్చుకున్ననాటి నుండే నగరంలోని భవన నిర్మాణ వ్యర్థలను సేకరించి, జీడిమెట్ల, ఫతుల్లాగూడ, జవహర్‌నగర్‌లలో నిల్వ చేసుకునేలా కాం ట్రాక్టు సంస్థను బల్దియా అదేశించింది. జూన్ 30 తేదీ నాటికి సుమారు లక్ష మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలను తరలించే నిల్వ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఇవే కాక ఇటీవల నగరంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఫుట్‌ఫాత్‌లపై అక్రమ నిర్మాణాల తొలగింపు సందర్భంగా వచ్చిన 1200 మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలను కూడా తరిలించారు.

నిర్మాణంలో జీడిమెట్ల సి అండ్ డి ప్లాంట్…
గ్రేటర్ హైదరాబాద్ జీడిమెట్ల, ఫతుల్లాగూడలో భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి జిహెచ్‌ఎంసి రాంకీ ఒప్పందం కుదుర్చుకున్న క్రమంలో జీడిమెట్లలో సి అండ్ డి ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర కాలుష్య మండలి అనుమతి ఇవ్వడంతో ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే వే బ్రిడ్జి నిర్మాణం ప్తూర్తయింది. ప్రస్తుతం నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు టన్నుకు రూ.256.50 పైసల చొప్పున ధరను నిర్ణయించారు. నగరవాసులు తమ వద్ద ఉన్న నిర్మాణ వ్యర్థాలను తొలగించాలనుకుంటే మైజిహెచ్‌ఎంసి యాప్ ద్వారాకానీ, జిహెచ్‌ఎంసి కాల్ సెంటర్ నెంబర్ 040 – 21 11 11 11కు ఫోన్ చేయాల్సి ఉంటుంది.

అక్రమంగా నిర్మాణ వ్యర్థాలు వేసేవారికి జరిమానాలు
నగరంలో అక్రమంగా భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్డుకు ఇరువైపులా, నాలాలు, చెరువుల్లో వేసేవారిని గుర్తించి, వారికి భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించారు.

భవన నిర్మాణ వ్యర్థాలను వేకుండా నియంత్రణ చర్యలు…
భవన నిర్మాణ వ్యర్థాలను తరలించే వాహనాలన్నింటినీ గుర్తించి, ప్రత్యేకంగా వాటికి మాత్రమే నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు అనుమతి ఇస్తారు.
జిహెచ్‌ఎంసి నుంచి అధికారికంగా కాం ట్రా క్ట్ పొందిన రాంకీ సంస్థ వద్ద సి అండ్ డి వ్యర్థాల తరలింపు వాహనాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
రోజుకు 20 టన్నులకు పైగా నిర్మాణ వ్యర్థాలను ఉత్పత్తి చేసే సంస్థలు తామే స్వయంగా నిర్మాణ వ్యర్థాలను ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలి, లేదా అనుమతి పొందిన వాహనానాలలో బల్దియా ప్లాంట్లకు తరలించాల్సి ఉంటుంది.
పాత భవనాలను కూల్చి కొత్తగా నిర్మించుకునే వారికి సి అండ్ డి వ్యర్థాల తరలింపు వ్యయాన్ని(యూజర్ చార్జీలు) భవన నిర్మాణ అనుమతుల ఫీజులలోనే చెల్లించాల్సి ఉం టుంది. ఒక్కో చదరపు అడుగు ఏరియాకు 12/–ల చొప్పున గతంలో స్థాయీసంఘం నిర్ణయించింది. అయితే సెల్లార్ తవ్వకాలకు సంబంధించి ఒక్కో చదరపు అడుగు ఏరియాకు 50/లుగా గతంలో స్థాయీసంఘం నిర్ణయించిన ధరపై ఇంకాస్త లోతుగా అధ్యయనం చేసిన అనంతరం నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఛార్జీలు ఎలా ఉన్నాయో, పరిశీలించాల్సిందిగా చీఫ్ సిటీప్లానర్‌ను కమిషనర్ అదేశించారు.
నిర్మాణ వ్యర్థాలను రోడ్డు పక్కనే, నాలాలు, చెరువుల్లో వేసినవారిని గుర్తించి, భారీగా జరిమానాలు విధించడం, వాహనాలను సీజ్ చేసే అధికారాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి కల్పించారు.
రాంకీ సంస్థ వద్ద నమోదు చేసుకున్న సి అండ్ డి వ్యర్థాలను తరలింపు వాహనాలు తప్పనిసరిగా జిహెచ్‌ఎంసి అమర్చుకోవాలి. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా వాహనం బల్దియా ప్లాంటుకు వెళ్లకుండా ఎక్కడైనా అక్రమంగా వ్యర్థాలను కుమ్మరించినట్లైతే బల్దియాలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా గుర్తించి, సదరు వాహనాన్ని సీజ్ చేసి, యజమానిపై కేసు పెట్టడం జరుగుతుందని అధికారులు అన్నారు.
నగరంలో ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాల ద్వారా అక్రమణ నిర్మాణ వ్యర్థాలను నాళాలు, చెరువులు, రోడ్లుపై వేసేవారిని గుర్తించే బాధ్యతను ఏ.ఇలు, ఎస్‌ఎఫ్‌ఏలకు ఇచ్చారు.

Comments

comments