Home ఆఫ్ బీట్ ఒటిపితో బదిలీ వాహనాలకు చెక్

ఒటిపితో బదిలీ వాహనాలకు చెక్

వాహనాల యాజమాన్య మార్పిడి తప్పని సరి
వెబ్‌సైట్‌లో మార్పులు

Commercial-Vehicles

మన తెలంగాణ/సిటీబ్యూరో : నూతన వాహనం కొనుగోలు చేసుకోవాలనుకున్న సమయంలో తమ పాత వాహనాన్ని సులువుగా వదిలించు కోవాలనుకునే వాహన యజమానులకు చెక్ పడనుంది. తమ వాహనాలను సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఫామ్ 29, 30ల మీద సంతకం చేసి సదరు కొనుగోలు దారుల కు ఇస్తే సరిపోయేది. కాని కొత్తగా ఓటీపీ (వన్ టైప్ పాస్‌వర్డ్)విధానాన్ని రవాణాశాఖ అధికారులు అమల్లోకి తీసుకు వస్తున్నారు. ఈ విధానం ద్వారా ఊరు పేరు లేకుండా ఎవరివో తెలియకుండా నగర రహదారులపై ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్న వాహనా లకు చెక్ పడనుంది. రవాణాశాఖ అందించి ప్ర తి ఆన్‌లైన్ సేవకు ఇక నుంచి ఓటీపీ తప్పని సరిగా చేశారు. దీంతో ఇటువంటి వాహనాల గుట్టు రట్టు కానుంది. ప్రస్తుతం నగరంలో సుమారు 46 లక్షల కు పైగా వాహనాలు తిరుగుతున్నాయి.వీటిలో 30 శాతం వరకే చేతులు మారాయి.

నిబంధనల ప్రకా రం ఒకరి నుంచి కొనుగోలు చేసిన వెంటనే యాజమాన్య హక్కులు బదిలీ చేసుకోవాలి. ఫారం 29,30 నింపి వాటిపై అసలు యజమాని,కొనుగోలు దారు సంతకాలు చేసి ఆర్సీ, ఇతర పత్రాలను జత చేయా లి అనంతరం నిర్ణీత ఫీజులు చెల్లించి సమీపంలోని రవాణాశాఖ కార్యాలయంలో అందించాలి. అప్పుడే అధికారికంగా అసలు యజమాని కోనుగోలు దారు ని పేరు మీద బదిలీ అవుతుంది. అయితే అనేక మం ది వాహనం కొన్న తర్వాత యాజమాన్య హక్కులను బదిలీ చేసుకోవడం లేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు విధించి చలానాలు వాహన నంబర్ ఆధారంగా పా త యజమానులు ఇంటికి చేరుతున్నాయి. రోడ్డు ప్ర మాదం జరిగిన సంధార్బాల్లో కూడా పాత యజమానే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ వాహనాలు ఏవైనా నేరాల్లో ఇరుక్కు పోతే పాత యజమానినే పోలీసులు మొదట అదుపులోకి తీసుకుంటున్నారు.

వాహనం అమ్మకం దారు నేరుగా రవాణాశాఖ వెబ్‌సైట్‌లో 29, 30 ఫారాలను స్వయంగా అప్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాహనం వేరొకకరి విక్రయించిన సమయంలో యాజమాన్య హక్కులు బది లీ చేస్తున్నట్లు 29,30 ఫారాలను సంతకాలు పెట్టి స మీపంలోని ఆర్టిఏ కేంద్రాల్లో అందించాలి. అనేక మంది ఈ అంశంపై పెద్దగా దృష్టిసారించడం లేదు. అందువల్ల అమ్మకం దారులు తాము 29,30 ఫా మ్‌లు కోనుగోలు దారునికి ఇచ్చినట్లు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి కొనుగోలుదారుని ఫోన్‌కు వివరాలు నమోదు చేయించాలన్నారు. 14 రోజులు తర్వాత కొనుగోలు దారునికి నోటీసులు ఇవ్వడంతో పాటు సెల్‌కు కూడా సమాచారం ఇస్తామన్నారు. అప్పటికి దారికి రాక పోతే వాహనం సీజ్ చేస్తామన్నారు.

ప్రైవేట్ ఫైనాన్షియర్లకు చిక్కులే

నగరంలో సుమారు 1లక్షా 30 వేల ఆటోలు రోడ్డు మీద తిరుగుతుండగా వాటిలో సగానికి పైగా ప్రైవే ట్ ఫైనాన్స్ కంపెనీల నిర్వాహకులవే ఉన్నాయి. సాధారణంగా ఫైనాన్స్ వ్యాపారులు ఆటో డ్రైవర్లకు కొద్ది మొత్తంలో ఫైనాన్స్‌ను అధిక వడ్డీకి ఇచ్చి వారి పేరు మీద ఆటోలను కోనుగోలు చేస్తారు. అధిక వ డ్డీలు చెల్లించన పక్షంలో వారు అతని వద్ద నుంచి ఆటోను స్వాధీనం చేసుకుని మరొకరికి ఇస్తుంటా రు. ఇటువంటి సమయంలో ఎటువంటి మార్పులు చేర్పులు జరగవు. దాంతో ఆ ఆటో పాత ఓనర్ పేరుమీద నడుస్తూ ఉంటుంది. దాంతో ఓటీపీ పద్దతి అ మల్లోకి వస్తే వారికి కూడా సమస్యలను ఎదుర్కోవా ల్సి వస్తుంది. వారు ఆటో పాత ఓనర్ చుట్టు తిరగా ల్సి వస్తుంది. దీన్ని ఆసరగా చేసుకున్న పాత యజమాని వారికి అనేక ఇబ్బందులను తీసుకువచ్చే అవకాశం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా ఆటోలను ఫైనాన్స్‌కు ఇచ్చే సంస్థలు కూడా ఇటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.