Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ట్రాన్స్‌ఫార్మర్ కెపాసిటీ పెంపు

harish1
రూ.60 లక్షలతో నూతన ఏర్పాట్లు, మంత్రి హరీశ్‌రావు వెల్లడి
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని నంగునూరు మండలం కొండంరాజుపల్లిలో విద్యుత్ సరఫరాలో లోవొల్టేజీ సమస్యను అధిగమించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి టి.హరీశ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. కొండంరాజుపల్లిలో వున్న 33/11 కె.వి సబ్ స్టేషన్ ఉన్న పిటిఆర్ 5ఎంవిఎ కెపాసిటీ ట్రాన్స్‌ఫార్మర్‌ను 8ఎంవిఎ కెపాసిటీకి పెంచుతున్నట్టు తెలిపారు. ఇందు కోసం 60లక్షల ఖర్చుతో నూతనంగా ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కొండంరాజుపల్లిలో 5ఎంవిఎ కెపాసిటీ గల రెండు ట్రాన్స్‌ఫార్మర్లు వున్నాయని, ఆ ప్రాంతంలో విద్యుత్ వాడకం పెరగడం వల్ల అంతరాయం ఏర్పడుతోందని, దీన్ని అధిగమించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 8ఎంవిఎ కెపాసిటీ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు వల్ల లోవోల్టేజీ సమస్య పరిష్కారమై నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుందని తెలిపారు. ఇప్పటికే పనులను ప్రారంభించడం జరిగిందని మరో రెండు రోజుల్లో పనులు పూర్తి చేసి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.

Comments

comments