Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

కలెక్టరేట్ రోడ్డులో కూలిన ట్రాన్స్‌ఫార్మర్

Transformer collapsed on the collectorate road

మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రధాన రహదారిలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల వర్షాలకు కూలి గురువారం పడిపోయింది. కలెక్టరేట్ ప్రధాన రహదారి కావడంతో వర్షం  ప్రభావం వల్ల జన సంచారం లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ అధికారులు ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందన్నారు. అధికారులు స్పందించి నాసిరకం పనులు చేయకుండా నాణ్యమైన పనులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Comments

comments