Home నిజామాబాద్ ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్

ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్

Transformer

మాక్లూర్: మాక్లూర్ మండల కేంద్రలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్కనే ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ గద్దె పగిలి ప్రమాదకరంగా మారినా సంబందిత ట్రాన్స్‌కో అధికారులు పట్టించుకోవటం లేదని, ఎప్పుడు పడిపోతుందోనని చుట్టు పక్కల వారు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫారానికి కనీసం కంచె కూడా ఏర్పాటు చేయక పోవటంతో నిత్యం అటుగా వెళ్లే పశువులు గద్దెను రాసుకుంటూ వెల్తుంటాయి, గద్దె పగిలిపోయి ఎప్పుడు కూలుతుందోనని ఆందోళన పడుతున్న వారికి గేదెలు, ఆవులు గద్దెను రాసుకుంటుండటంతో మరిత భయానికి లోనవుతున్నారు. విద్యుత్ ట్రాన్స్ ఫారం పక్కనుండి నిత్యం విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తిరుగు తుంటారని వెంటనే ట్రాన్స్ పారం గద్దె నిర్మించి చుట్టూ కంచెను ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.