Home తాజా వార్తలు ఉప్పల్ ఎసిపిపై హిజ్రాల దాడి..!

ఉప్పల్ ఎసిపిపై హిజ్రాల దాడి..!

Husband Attack on Wife In Uttharpradeshమేడ్చల్: ఉప్పల్ బస్టాండ్ వద్ద బుధవారం ఉదయం కొందరు హిజ్రాలు బీభత్సం సృష్టించారు. బస్టాండ్ లో ప్రయాణికుల వద్ద బలవంతంగా డబ్బుకోసం డిమాండ్ చేయడంతో ఇబ్బంది పడిన కొందరు వారిని ప్రశ్నించారు. దీంతో కోపంతో రగిలిపోయిన హిజ్రాలు అక్కడున్న కార్లను ధ్వంసం చేశారు. కనిపించిన మహిళల వద్ద బంగారు ఆభరణలు లాక్కున్నారు. పురుషుల వద్ద నుంచి బలవంతంగా మొబైల్స్, పర్సులు గుంజుకున్నారు. హిజ్రాల దాష్టీకాన్ని చూసిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపైనా కూడా వారు దాడికి దిగారు. ఉప్పల్ ఎసిపి గాంధీ నారాయణపై దాడికి యత్నించగా, అడ్డుకోబోయిన ముగ్గురు పోలీసులపై విరుచుకుపడ్డారు. దీంతో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో కొందరు హిజ్రాలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. పిఎస్ లో కూడా హిజ్రాలు నానా రభసా చేశారు. అదనపు బలగాల సహాయంతో ఘటనతో సంబంధం ఉన్న పలువురు హిజ్రాలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Transgenders trying to attack on Uppal ACP