Home నవ విజ్ఞానం కొత్త గ్రహాన్ని కనుగొన్న నాసా ప్రోబ్

కొత్త గ్రహాన్ని కనుగొన్న నాసా ప్రోబ్

Transiting Exoplanet Survey

 

సౌరవ్యవస్థకు అవతల 53 కాంతి సంవత్సరాలకు దూరంగా మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమించే కొత్త గ్రహాన్ని నాసా ప్రోబ్ కనుగొన గలిగింది. ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (టిఇఎస్‌ఎస్) నిర్ధారించిన మూడో కొత్త గ్రహం ఇదే. ఈ టిఇఎస్‌ఎస్ గత ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమైంది. హెచ్‌డి 21749బి అని ఈ కొత్త గ్రహానికి పేరు పెట్టారు. ఇది అత్యంత కాంతివంతమైన సమీప నక్షత్రం చుట్టూ రెటిక్యులమ్ నక్షత్ర మండలంలో పరిభ్రమిస్తోంది. టిఇఎస్‌ఎస్ కనుగొన్న మూడు గ్రహాల్లో ఇది సుదీర్ఘ కాల భ్రమణం కలిగిన గ్రహంగా గుర్తించారు. ఇతర రెండు గ్రహాలైన పి మెన్సే బి సూపర్‌ఎర్త్ గ్రహం కక్ష భ్రమణం 6.3 రోజులు కాగా, ఎల్‌హెచ్‌ఎస్ 3844బి శిలా ప్రపంచం ఇది తన నక్షత్రం చుట్టూ కక్షలో వేగంగా 11 గంటల్లోనే పరిభ్రమిస్తుంది. వీటితో పోల్చిచూస్తే ఈ కొత్త గ్రహం 21749బి తన నక్షత్రం కక్ష చుట్టూ చాలా విశ్రాంతిగా ఆలస్యంగా 36 రోజుల పాటు పరిభ్రమించడం చెప్పుకోతగ్గ విషయం. టిఇఎస్‌ఎస్ ఏర్పాటైన మొదటి మూడు నెలల్లోనే ఈ మూడు కొత్త గ్రహాలు కనుగొనడం విశేషం.

కాంతివంతమైన నక్షత్రం చుట్టూ పరిభ్రమించే చాలా చల్లని చిన్న గ్రహం ఇదని పరిశోధకులు డయానా డ్రాగోమిర్ చెప్పారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి చెందిన ఈ పరిశోధకుడు ఈ పరిశోధనకు నాయకత్వం వహిస్తున్నారు. ఉష్ణగ్రహాల వాతావరణం గురించి మనకు చాలా తెలుసు. కానీ నక్షత్రాలకు దూరంగా ఉండే చల్లని చిన్నపాటి గ్రహాల గురించి మనకు తెలియదు. కానీ అదృష్టవశాత్తు ఈ కొత్త గ్రహాన్ని తాము పట్టుకోగలిగామని డయానా చెప్పారు. ఇప్పుడు సవివరంగా దీన్ని అధ్యయనం చేస్తున్నాం అని అన్నారు. ఈ కొత్త గ్రహం భూగోళానికి మూడింతలు పెద్దదని, సబ్ నెప్టూన్ కేటగిరి కింద దీన్ని పరిగణించడమైందని చెప్పారు.

ఏదెలాగున్నా మిగతా గ్రహాలకు భిన్నంగా ఇది పూర్తిగా శిలలతో నిండి ఉండనందున నివసించడానికి అనుకూలంగా ఉంటుందని ఈ గ్రహం వాయువుతో రూపొందినవని, నెప్టూన్ లేదా యురేనస్‌ల కన్నా దీని భౌగోళ తత్వం చాలా సాంద్రంగా ఉంటుందని వివరించారు. నెప్టూన్ లేదా యురేనస్ మాదిరిగా ఇది వాయుభరితంగా ఉండకపోవచ్చని తాము భావిస్తున్నామని, ఆయా గ్రహాల్లో ఎక్కువగా హైడ్రొజన్ వాయువు నిండి ఉంటుందని, వాస్తవానికి రొప్పుతుంటాయని పేర్కొన్నారు. ఈ కొత్త గ్రహం నీటి సాంద్రతతో లేదా చిక్కని వాతావరణంతో ఉండ వచ్చునని అభిప్రాయం వెలిబుచ్చారు.
     – సైన్స్ విభాగం

Transiting Exoplanet Survey Satellite discovered third planet

Telangana Latest News