Search
Saturday 17 November 2018
  • :
  • :

పారదర్శకం

POETRY

మధ్య గాజు తలుపు –
అటు, ఖరీదైన కదలికలు
మంత్రాంగాలు, విలాసాలు –
ఇటు, నిస్సహాయత
ఎదురు చూపులు, పడిగాపులు!

దృశ్యం పాతదే –
తెలిసే గెలిపించాం,
తెలిసే అనుభవిస్తున్నాం
అదొక అలౌకికానందంగా స్వీకరించాం –
కొత్తగా, ఈ ప్రస్తావన…
గోకుడేల?

రాజకీయాల్ని
రాజకీయ నాయకుల్ని
నవ్వుకోడానికో, టైం పాస్ కో
తలచుకోవాలి –
విన్నపాలు, నిరసనలు అవసరమా?
కామెడీ సినిమా చూస్తున్నాం
ఎంజాయ్ !
కన్నీళ్లు నిషిద్ధం!!

ఎం.కె. సుగమ్ బాబు
8096615202

Comments

comments