Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

వాహనదారులకు వడ్డన..!

గుట్టుచప్పుడు కాకుండా అమలులోకి
వచ్చిన రవాణా ఫీజుల చెల్లింపు
నాలుగింతలు పెరిగిన చార్జీలు
ఫిట్‌నెస్ రెన్యూవల్ సమయం దాటితే
రోజుకు 50 రూపాయల జరిమాన
యేటా సమకూరనున్న లక్షల ఆదాయం

Traffic-jam

ఆసిఫాబాద్ : రవాణా సేవల చార్జీలు గుట్టుచప్పుడు కాకుండా భారీగా పెంచివేశారు. కొత్తగా వాహనాలు కోనుగోలు చేసి రిజిస్టేషన్ కోసం ఇతర రవాణా ఫీజులు చెల్లించడానికి వచ్చిన వినియోగదారులు చార్జీల పెంపు పై అవాక్ అవుతున్నారు. ముందస్తు ప్రచారం లేకుండా ఒక్కసారిగా చార్జీలు నాలుగింతలు పెరుగడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. కొత్త చార్జీల వసూల్ నెల రోజుల క్రితమే అమలులోకి తెచ్చారు. రిజిస్టేషన్,లెర్నింగ్ లైసెన్సు,ఫిట్‌నెస్ ఇలా వివిధ రకాల సేవలకు కేంద్రప్రభుత్వం భారీగా ఫీజులు పెంచడంతో జిల్లాలో రవాణాశాఖకు 1.20 కోట్ల ఆదా యం పెరగనుంది. కోమురంభీంజిల్లాలో 24వేల 880 వాహనాలు ఉండగా,ద్విచక్రవాహనాలు 16వేల260, కా ర్లు 928, ట్రాక్టర్లు 2166, ఆటోలు 2653తో పాటు గూ డ్స్ వాహనాలు 2167, మాక్స్‌క్యాబ్ 33, మోటార్ క్యాబ్ లు 462తో పాటు ఇతర వాహనాలు 209 ఉన్నాయి. వీటికి సంబంధించిన ఫీజుల చెల్లింపు ఫిట్‌నెస్,లైసెన్సు రెన్యూవాల్ చార్జీలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఫిట్‌నెస్ రెన్యూవాల్ గడువు దాటితే ప్రతిరోజు 50 రూపాయల జరిమాన కట్టాల్సి ఉంది. కొన్ని సేవలకు 3 రేట్లు పెరిగితే మరికొన్ని సేవలకు 4 రేట్ల చార్జీలు పెరిగాయి.

లెర్నింగ్ లైసెన్సు ఫీజులు కట్టడంలో గతంలో అన్ని చార్జీలు కలుపుకుంటే 90 రూపాయలు ఉంటే ప్రస్తుతం 260 రూపాయలు పెరిగింది. లైసెన్సు కావాలంటే 550 నుంచి 960 కి పెరిగింది. లైసెన్సు టెస్టు క్రింద గతంలో 20 రూపాయలు వసూల్ చేసేవారు. ఇప్పుడు 300 రూపాయలు వసూల్ చేస్తున్నారు. అదనపు క్యాటగిరిలో లైసెన్సు పొందాలంటే 300 రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సివస్తుంది. అంతర్జాతీయ లైసెన్సు 650 నుంచి 1000 రూపాయలకు పెరిగింది. ఎండర్స్‌మెంట్ ఫీజు 50 రూపాయల నుంచి 500 రూపాయల వరకు పెరిగింది. డ్రైవింగ్ స్కూల్ లైసెన్సు 2500 నుంచి 10వేల రూపాయలకు పెరిగింది.

డబుల్‌కేట్ కార్డు కావాలంటే 5000 రూపాయలు చెల్లించాలి. గూడ్స్ వెహికల్ 1425 రూపాయలు రెన్యూవాల్‌కు 660 రూపాయలు పెరిగింది. వాహనాలు రిజిస్టేషన్ చేయాల్సి వస్తే ఈ గ్యారేజ్ వెహికల్స్‌కు 435,మోటార్ సైకిల్‌కు 685,లైట్‌మోటార్ వెహికల్‌కు 1035 ట్రాన్స్ పోర్టు వెహికల్ 1300 గూడ్స్ వెహికల్‌కు 1800 రూపాయలు రిజిస్టేషన్ ఫీజు కోసం వసూల్ చేస్తున్నారు. ఇతర వాహనాలకు 3వేల 300 రూపాయల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మోటార్ సైకిల్ ఓనర్ షీట్ మార్చుటకు 535 నుండి 835 పెరిగింది. రెన్యూవాల్‌లో జాప్యం జరిగితే ప్రతినెలకు 300 రూపాయలు,కార్డు 500 రూపాయలు అదనంగా వసూల్ చేస్తారు. ఫిట్‌నెస్ రెన్యూవాల్ సమయం దాటితే ప్రతిరోజు 50 రూపాయల జరిమాన,నెలకు 1500,సంవత్సరానికి 18వేలు చెల్లించాల్సి ఉంటుంది. భారీగా చెల్లించిన చార్జీలతో వాహనదారుల పై అధికభారం పడుతుంది. పెరిగిన ధరలు తెలియాక ఆర్టీఎ ఆఫీసుకు వచ్చి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

కొత్తగా పెరిగిన రవాణా ఫీజులను వాహనదారులు సకాలంలో చెల్లించాలి. లేకుంటే భారీగానే జరిమానాలు కట్టే పరిస్దితి ఉంది. ఫిట్‌నెస్‌కు గడువుదాటిన తర్వాత ప్రతిరోజు 50 రూపాయల చార్జీ కట్టాల్సిఉంటుంది. వాహనాల రెన్యూవాల్‌లో జాప్యం జరిగిన అదనంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది.గత ఫీజుల ప్రకారం ఎవరైనా చాలన్,డిడిలు కడితే మిగతా డబ్బులు ఆర్టీఎ కార్యాలయంలో చెల్లించవచ్చు.
– జిల్లా రవాణాధికారి శ్యాంనాయక్

Comments

comments