Home తాజా వార్తలు ట్రాన్స్‌ట్రాయ్‌కి పోలవరం కాంట్రాక్ట్ ఎలా వచ్చింది

ట్రాన్స్‌ట్రాయ్‌కి పోలవరం కాంట్రాక్ట్ ఎలా వచ్చింది

 Purandeswari

ఆంధ్రప్రదేశ్: అర్హతలేని ట్రాన్స్‌ట్రాయ్‌కి పోలవరం కాంట్రాక్ట్ ఎలా వచ్చిందని బిజెపి నేత పురందేశ్వరి ప్రశ్నించారు. పోలవరం అంచనాలు సవరించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి పురందేశ్వరి లేఖ రాశారు.  2013 భూసేకరణ చట్టం ప్రకారం అంచనాలు పెంచాలని డిమాండ్ చేశారు. 2019 నాటికి పోలవరం పూర్తికి కేంద్రం సహకరించాలని కోరారు. రాయలసీమ, కృష్ణాడెల్టాకు పోలవరం నిర్మాణం అత్యవసరంగా మారిందని చెప్పారు. ట్రాన్స్ ట్రాయ్ సంస్థ పోలవలరం పనులు చేయలేకపోతుందన్నారు. పోలవరం నిర్మించే సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి మూడేళ్ల తరువాత తెలిసిందా అని దుయ్యబట్టారు. అంచనాలు పెంచాలని అడగాల్సిన ప్రభుత్వం.. 60 సి కింద ట్రాన్స్ ట్రాయ్‌కి రాష్ట్ర ప్రభుత్వం ఎలా నోటిసులిచ్చిందని నిలదీశారు. అంచనాలు ఎలా పెంచారో అడగకుండానే కేంద్రం నిధులిస్తోందని పురందేశ్వరి ప్రశ్నించారు.