Home జిల్లాలు పశువుల కొట్టంగా రుద్రూర్ బస్టాండ్

పశువుల కొట్టంగా రుద్రూర్ బస్టాండ్

Travelers  are due to the bust of a busted dung
Travelers are due to the bust of a busted dung

మనతెలంగాణ/రుద్రూర్: నూతనంగా ఏర్పడిన రుద్రూర్ మండల కేంద్రంలో  బస్టాండ్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. ఈ బస్టాండ్ మహారాష్ట్ర పలు పట్టణాలు,జిల్లాకు అడ్డాగా ఉంది. బస్టాండ్ పరిస్థితి ఏళ్ళు గడిచిన సమస్య ఎక్కడ వేసిన గోంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్రతీ ఏట బస్టాండ్‌కు నిధులు అధికంగానే అద్దె రూపంలో వస్తున్న అభివృద్ది మాత్రం శూన్యమంటున్నారు ప్రజలు. పశువులకు నిలయంగా మారింది. వ్యక్తిగత మరుగుదొడ్ల సౌకర్యాలు సక్రమంగా లేకపోవడం చెత్త,చెదారం నీటి సౌకర్యంతో పాటు పలు మౌళిక సౌకర్యాలు లేక ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. బస్టాండ్‌లో దుర్గంద దుర్వాసన రావటం వల్ల ప్రయాణికులు ఎండలో తలదాచుకుంటున్న పరిస్థితి నెలకొంది. బస్సులు నిల్వడానికి ప్రాంగణం సక్రమంగా లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురౌతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతీనెల అద్దె భవనాల ద్వారా అద్దె రూపంలో డబ్బులు వస్తున్న అభివృద్ది అంతంత మాత్రమేనంటున్నారు ప్రయాణికులు. టీవీ ఉన్న నిరూపయోగంగా ఉందని ఇప్పటికైనా బస్టాండ్ పరిస్థితి మార్చాలని ప్రజలు,ప్రయాణికులు కోరుతున్నారు.