Search
Sunday 18 November 2018
  • :
  • :

ప్రపంచాన్ని చుట్టిరావచ్చు..

Aeroplane

మూడు గంటల్లో ప్రపంచాన్ని చుట్టి రావాలనుందా. ఇంకెందుకు ఆలస్యం. హైపర్ సోనిక్ విమానంతో  సాధ్యమే  అంటోంది విమాన తయారీ సంస్థ బోయింగ్. ధ్వని కంటే అయిదు రెట్లు వేగంగా ప్రయాణించే హైపర్‌సోనిక్ విమానాన్ని తయారుచేసేందుకు ప్రణాళికలు రచించింది. గంటకు 3,800 మైళ్ల వేగంతో ప్రయాణించే విమానాన్ని తయారుచేసేందుకు ముందుకొచ్చింది. ఈ విమానంలో న్యూయార్క్ నుంచి లండన్ 120 నిముషాల్లో ప్రయాణించవచ్చు.  అంటే ప్రపంచాన్ని మూడు గంటల్లో తిరిగి రావచ్చన్నమాట.

విమానం తయారీకి కావల్సిన ప్రణాళికలు ప్రాథమిక దశలో ఉన్నాయనీ, కొన్ని సాంకేతిక సమస్యలను అధిగమించాల్సి ఉందని సంస్థ ప్రతినిధి బియానా జాక్సన్ అంటున్నారు.   ఈ విమానం అందుబాటులోకి వస్తే ధ్వని కంటే రెండు రెట్లు వేగంగా ప్రయాణించే ఆంగ్లో ఫ్రెంచ్ విమానం కాంకోర్ట్ ను మించిన విమానంగా చరిత్రలో నిలిచిపోనుంది. ఈ సేవలు అందుబాటులోకి రావడానికి ఇంకా 20ఏళ్లకు పైగా సమయం పడుతుందని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.

Comments

comments