Home ఆఫ్ బీట్ కాలిఫోర్నియా టూ సికింద్రాబాద్‌కు కారులో ప్రయాణం

కాలిఫోర్నియా టూ సికింద్రాబాద్‌కు కారులో ప్రయాణం

Travelling-California-to-Se

మన తెలంగాణ/కంటోన్మెంట్ : ఇద్దరు వైద్య దంపతులు కారులో ప్రపంచంలో ని పలు ఖండాలను దాటి నగరానికి చే రుకున్నారు. సికింద్రాబాద్‌లోని రాణిగంజ్ ప్రాంతానికి చెందిన డాక్టర్ రాజేష్, డాక్టర్ దర్నని రాజేష్‌లు కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు. కాగా 7వైఎ909 నెంబర్ గల కారులో కాలి ఫోర్నియా నుంచి బయలు దేరి 3 ఉప ఖండాల పరిధిలోని 19 దేశాలు దాటుతూ 62 రోజుల పాటు కారులో ప్రయాణం చేస్తూ మంగళవారం నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారి ప్రయాణంకు సంబంధించిన అనుభవాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు మార్గం గుండా ప్రయాణం చేయాలనే హాబితో కారులో సహాసయాత్రగా బయలుదేరామని, ప్రయాణం సమయంలో ఎన్నో అనుకూల, ప్రతి కూల వాతవరణాలను ఎదుర్కొన్నామని, అనుభవాలను నేర్చుకున్నామని వారు వెల్లడించారు.
కాలిఫోర్నియా దేశం నుంచి బయలుదేరి న్యూయార్క్, ఫారిస్, బ్రెజిల్, బెల్జియం, జర్మని, డెన్మార్క్, స్పిడన్, షిన్‌లాండ్, నెదర్లాండ్, రష్యా, ఓరన్‌బెర్గ్, కజకిస్తాన్, కిజకిస్తాన్, చైనా, టిబెట్, నేపాల్ దేశాల మీదుగా ఇండియాకు చేరుకుని నగరాన్ని చేరుకున్నారు.